Free Ration: ఉచిత రేషన్ తీసుకునేవారికి అలర్ట్‌.. ఈ ప్రమాదంలో పడవద్దు..!

Free Ration: మీకు రేషన్ కార్డ్ ఉంటే మీరు ప్రభుత్వ ఉచిత రేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లయితే ఈ వార్త బాగా ఉపయోగపడుతుంది.

Update: 2023-05-17 07:27 GMT

Free Ration: ఉచిత రేషన్ తీసుకునేవారికి అలర్ట్‌.. ఈ ప్రమాదంలో పడవద్దు..!

Free Ration: మీకు రేషన్ కార్డ్ ఉంటే మీరు ప్రభుత్వ ఉచిత రేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లయితే ఈ వార్త బాగా ఉపయోగపడుతుంది. రేషన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిరంతరం చెబుతూనే ఉంది. అయినప్పటికీ చాలామంది ఈ పనిచేయడం లేదు. రేషన్ కార్డుని ఆధార్‌తో లింక్ చేయకుంటే ప్రభుత్వం రేషన్ కార్డును రద్దు చేస్తుంది. ఇంతకు ముందు దీని చివరి తేదీ మార్చి 31, 2023గా ఉండేది. కానీ ఇప్పుడు దీనిని జూన్ 30, 2023 వరకు పొడిగించారు.

రేషన్ కార్డు రద్దు

జూన్ 30, 2023లోపు రేషన్ కార్డ్, ఆధార్ లింక్ చేయకపోతే రేషన్ కార్డ్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. జూలై 1 నుంచి మీకు రేషన్‌లో లభించే గోధుమ-బియ్యం లభించదు. అంతేకాదు దీనివల్ల మీరు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తవానికి పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ కాకుండా రేషన్ కార్డు కూడా గుర్తింపు, చిరునామా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాలు పొందాలంటే కచ్చితంగా రేషన్‌ కార్డు ఉండాలని గుర్తుంచుకోండి.

జూన్ 30 డెడ్‌ లైన్‌

రేషన్ కార్డ్‌తో ఆధార్‌ని లింక్ చేయడం వల్ల ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డ్‌లను పొందకుండా ప్రభుత్వం నిరోధించగలదు. అంతేకాకుండా అధిక ఆదాయ పరిమితి కారణంగా రేషన్ పొందడానికి అనర్హులుగా ఉన్న వారిని గుర్తించవచ్చు. దీనివల్ల అర్హులైన వ్యక్తులకి న్యాయం జరుగుతుంది. సరైన వ్యక్తులు మాత్రమే సబ్సిడీ గ్యాస్ లేదా రేషన్ పొందుతారు. డూప్లికేట్ రేషన్ కార్డులు, దళారుల యథేచ్ఛను అంతం చేయడంలో ఈ రెండింటి అనుసంధానం సహాయపడుతుంది. మీరు ఇంకా మీ రేషన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేయకుంటే జూన్ 30, 2023లోపు ఈ పనిని పూర్తి చేయండి.

ఆన్‌లైన్‌లో రేషన్ కార్డ్‌ ఆధార్‌ ఎలా లింక్ చేయాలి..?

1. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) పోర్టల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2. ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్ వివరాలను నమోదు చేయండి.

3. తర్వాత కంటిన్యూ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

4. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

5. OTPని నమోదు చేయడం ద్వారా లింక్ రేషన్ కార్డ్-ఆధార్ కార్డ్‌పై క్లిక్ చేయండి.

6. అంతే ఆధార్‌ రేషన్‌ లింక్‌ అయినట్లు మెస్సేజ్‌ వస్తుంది.

Tags:    

Similar News