ఈ బ్యాంకు ఖాతాదారులకు 25 లక్షల సాయాన్ని అందిస్తోంది.. ఎలాగంటే..?

*ఈ పథకం కింద బ్యాంక్ తన ఖాతాదారులకు నగదు క్రెడిట్, టర్మ్ లోన్ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుంది.

Update: 2021-11-18 09:45 GMT

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (ఫైల్ ఫోటో)

PNB Tatkal Scheme: దేశంలోని రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు 'పంజాబ్ నేషనల్ బ్యాంక్' తన ఖాతాదారులకు రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందించే పథకాన్ని తీసుకొచ్చింది. PNB ఈ ఆర్థిక సహాయానికి PNB తత్కాల్ పథకం అని పేరు పెట్టింది. ఈ పథకం కింద బ్యాంక్ తన ఖాతాదారులకు నగదు క్రెడిట్, టర్మ్ లోన్ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుంది.

PNB కస్టమర్లు రూ.1 లక్ష నుంచి రూ.25 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని పొందవచ్చు.

బ్యాంక్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ పథకం గురించి సమాచారాన్ని అందించింది. "PNB తత్కాల్ పథకం కింద నగదు క్రెడిట్, టర్మ్ లోన్ రూపంలో ఆర్థిక సహాయం పొందండి" అని రాసింది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే లేదా పాత వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వినియోగదారులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేసింది.

ఈ పథకాన్ని ప్రారంభించడం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థిక సహాయం అందించడమే అని స్పష్టం చేసింది.

పథకం సద్వినియోగం..

1. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ పథకం ప్రయోజనం ఏదైనా వ్యాపారం, సంస్థ, కంపెనీ, ట్రస్ట్, పరిమిత భాగస్వామ్య లేదా సహకార సంఘాన్ని నడుపుతున్న వినియోగదారులకు కల్పిస్తోంది.

2. పథకం ప్రయోజనాన్ని పొందడానికి మీరు రిజిస్టర్డ్ GST నంబర్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. దీనితో పాటు, మీరు కనీసం ఒక సంవత్సరం పాటు GST రిటర్న్‌లను ఫైల్ చేసి ఉండాలి.

3. ఏదైనా స్థిర ఆస్తిని కొనుగోలు చేయడానికి వర్కింగ్ క్యాపిటల్, టర్న్ లోన్ సౌకర్యం కోసం నగదు క్రెడిట్ అందిస్తుంది. ఈ పథకం కింద కనీస మొత్తం రూ.1 లక్ష నుంచి గరిష్టంగా రూ. 25 లక్షల వరకు మంజూరు చేస్తుంది.

4. వడ్డీ రేటు బ్యాంకు పాలసీ మార్గదర్శకాల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.


Tags:    

Similar News