Stock Market: మూడో సెషన్‌లో భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితం కాగా రెండు సెషన్లలోనూ భారీ లాభాలతో అదరగొట్టాయి.

Update: 2021-04-03 04:23 GMT

Representational Image

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితం కాగా... రెండు సెషన్లలోనూ భారీ లాభాలతో అదరగొట్టాయి. సోమవారం హోలీ, శుక్రవారం గుడ్‌ఫ్రైడే సెలవులు కావడంతో వారంలో ట్రేడింగ్ మూడు రోజులు మాత్రమే జరిగింది. భారత ఈక్విటీ మార్కెట్‌ కొత్త ఆర్థిక సంవత్సరం 2021–22కి భారీ లాభాలతో స్వాగతం పలికింది. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో దేశీయ మార్కెట్‌ లాభాల్ని మూటగట్టింది. బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్‌ 521 పాయింట్లు లాభంతో 50 వేలకు పైన 50వేల 030 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 14వేల 867 వద్ద నిలిచింది.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు వారంలో జరిగిన తొలి సెషన్‌లో లాభాల బాటన ట్రేడింగ్ ఆరంభిస్తూ భారీ లాభాల్లో ముగిశాయి ఆయితే రెండో రోజుకి వచ్చేసరికి దేశీ మార్కెట్లు నష్టాలను మూటగట్టాయి. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజు బెంచ్‌ మార్క్ సూచీలు కుప్పకూలాయి. దేశీయంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులకు తోడు ద్రవ్యోల్బణ ఆందోళనలు. యుఎస్ బాండ్ల దిగుబడులు పెరగడం తదితర అంశాల నేపధ్యంలో దేశీ మార్కెట్ లో అప్రమత్తత కొనసాగింది.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మూడో సెషన్‌లోనూ భారీ లాభాలను అందించాయి. గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి ట్రేడింగ్ రోజున బెంచ్‌మార్క్ సూచీలు లాభాల బాటన దూకుడు కొనసాగించాయి. తాజా వారంలో విదేశీ ఇన్వెస్టర్లు 149 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీ సంస్థాగత మదుపర్లు 297 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి

Tags:    

Similar News