Bank Privatization: త్వరలో 2 ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ..!
Bank Privatization: దేశంలో ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది...
Bank Privatization: దేశంలో ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. త్వరలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించబోతోంది. ఇప్పటికే బిడ్లు కూడా రావడం మొదలయ్యాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి ప్రైవేటీకరణ ప్రారంభమవుతుంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు దీనికి నిరసనగా సమ్మె చేస్తున్నారు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని సవరించడం ద్వారా పిఎస్‌యు బ్యాంకులలో (పిఎస్‌బి) విదేశీ యాజమాన్యంపై 20% పరిమితిని తొలగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ఇందుకోసం ప్రభుత్వం రెండు ప్రభుత్వ బ్యాంకులను షార్ట్‌లిస్ట్ చేసిందని చెబుతున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. బ్యాంకుల ప్రైవేటీకరణకి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయని, కేబినెట్ ఆమోదానికి కొంత సమయం పట్టవచ్చని సమాచారం. వర్షాకాల సమావేశాల్లో సవరణలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సెప్టెంబర్ నాటికి కనీసం ఒక్క బ్యాంకునైనా ప్రైవేటీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు, FY22 లో IDBI బ్యాంక్‌తో పాటు రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించారు. ఇది కాకుండా ప్రైవేటీకరణ కోసం నీతి ఆయోగ్ రెండు PSU బ్యాంకులను కూడా షార్ట్‌లిస్ట్ చేసింది. నిరంతర నిరసనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం తగ్గలేదు. ముందుగా ప్రైవేట్‌గా మార్చబడే రెండు బ్యాంకులు ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని సమాచారం. ఈ రెండు బ్యాంకులను ముందుగా ప్రైవేటీకరించవచ్చు.