సామాన్యులకి పెద్ద దెబ్బ.. ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి, సురక్ష బీమా యోజన ప్రీమియం పెరిగింది..!

PMJJBY and PMSBY Premium: జూన్‌ 1 నుంచి ప్రభుత్వ బీమా కోసం ఇక ఎక్కువ చెల్లించాల్సిందే.

Update: 2022-06-01 06:30 GMT

సామాన్యులకి పెద్ద దెబ్బ.. ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి, సురక్ష బీమా యోజన ప్రీమియం పెరిగింది..!

PMJJBY and PMSBY Premium: జూన్‌ 1 నుంచి ప్రభుత్వ బీమా కోసం ఇక ఎక్కువ చెల్లించాల్సిందే. 2014లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పేదలు, నిరుపేదలకు బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటి నుంచి అంటే జూన్ 1, 2022 నుండి మీరు దీని కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

PMJJBY ప్రీమియం ఎంత పెరిగింది?

ఈ రెండు పథకాల ప్రీమియాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)వార్షిక ప్రీమియం రూ. 330 నుంచి రూ. 436కి పెరిగింది. ప్రభుత్వం ప్రీమియం మొత్తాన్ని రోజుకు రూ.1.25 పెంచింది.

PMSBY ప్రీమియం ఎంత పెరిగింది?

ఇది కాకుండా ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) ప్రీమియాన్ని రూ.12 నుంచి రూ.20కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఈ ప్రీమియం సంవత్సరానికి రూ. 12 మాత్రమే. ఇప్పుడు రూ.8 పెంచారు.

మార్చి 31, 2022 నాటికి, PMJJBY యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 6.4 కోట్లు, అలాగే PMSBY యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 22 కోట్లుగా ఉంది. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ప్రారంభించినప్పటి నుంచి రూ. 1,134 కోట్లు ప్రీమియంగా డిపాజిట్ అయింది. అయితే మార్చి 31, 2022 వరకు ఈ పథకం క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో రూ. 2,513 కోట్లు విడుదల అయ్యాయి. మరోవైపు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కోసం రూ. 9,737 కోట్ల ప్రీమియం వసూలు చేశారు. మార్చి 31, 2022 వరకు క్లెయిమ్‌గా రూ. 14,144 కోట్లు విడుదల చేశారు. 

Tags:    

Similar News