ప్రధానమంత్రి వయ వందన యోజన.. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్..ఈ రెండింటిలో ఏది బెస్ట్..?
PMVVY And SCSS: ప్రధానమంత్రి వయ వందన యోజన.. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఈ రెండు వృద్దాప్యంలో మంచి పెట్టుబడులుగా చెప్పవచ్చు. రిటైర్మెంట్ తర్వాత పెట్టుబడి పెట్టే పథకాలు. ఈ రెండు స్కీములకు ప్రభుత్వ మద్దతు ఉంటుంది. ఒకటి ఎల్‌ఐసీ నిర్వహిస్తుంటే మరొకటి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందిం. వయ వందన యోజనలో మీరు రిటర్న్ పొందే సమయం మీ కోరిక ప్రకారం నిర్ణయించుకోవచ్చు. అదే త్రైమాసిక రాబడిని పొందాలనుకుంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ బెస్ట్. ఈ రెండు పథకాల లాభ, నష్టాల గురించి తెలుసుకుందాం.
PMVVY పాలసీ వ్యవధి 10 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో హామీతో కూడిన రాబడి ఉంటుంది. SCSS అనేది 5 సంవత్సరాలు దీనిని మరో 3 సంవత్సరాలు పొడిగించవచ్చు. PMVVYలో పెన్షన్ 8% వడ్డీ చొప్పున చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వడ్డీ రేటు 7.4%. ఇది జూలై 2021 నుంచి సెప్టెంబర్ 2021 కాలానికి సంబంధించినది. PMVVYలో పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. SCSSలో సెక్షన్ 80C కింద 1.5 లక్షల మినహాయింపు పొందవచ్చు. అయితే సంపాదించిన వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది.
PMVVYలో మీరు వడ్డీ డబ్బును నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షికంగా తీసుకోవచ్చు. SCSS లో కేవలం త్రైమాసికంలో మాత్రమే డబ్బు చెల్లిస్తారు. PMVVY స్కీమ్ కోసం 60 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. సాధారణ వ్యక్తికి SCSSలో వయస్సు పరిమితి 60 సంవత్సరాలు కానీ రిటైర్మెంట్ పొందినవారు 55-60 సంవత్సరాల వయస్సులో ఈ పథకాన్ని తీసుకోవచ్చు. PMVVYలో 3 సంవత్సరాలు పథకాన్ని అమలు చేసిన తర్వాత 75% రుణం తీసుకోవచ్చు. SCSSలో రుణం తీసుకోలేరు అంతేకాదు హామీగా రుణం కూడా పొందలేరు.
మీరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టవచ్చు. ప్రధాన్ మంత్రి వయ వందన యోజన అత్యల్ప కొనుగోలు ధర రూ. 1.5 లక్షలు. ఇది తర్వాత రూ. 1000 పింఛను అందిస్తుంది. మీరు PMVVYలో గరిష్టంగా రూ. 15 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఇది ప్రతి నెలా 10000 పెన్షన్ ఇస్తుంది. మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో PMVVY కొనుగోలు ధరలో 98 శాతం వెనక్కి తీసుకోవచ్చు. పెట్టుబడి ప్రకారం మీరు ఈ రెండింటిలో ప్రయోజనాలను చూస్తారు.