పేద ప్రజలకి ఇదొక వరం.. కేవలం రూ. 20 చెల్లిస్తే రూ.2లక్షల ప్రయోజనం..!

Pradhan Mantri Suraksha Bima Yojana: జీవితంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చాలా ముఖ్యమైనవి. అందుకే చాలామంది వీటిని తీసుకుంటున్నారు.

Update: 2023-08-17 15:00 GMT

పేద ప్రజలకి ఇదొక వరం.. కేవలం రూ. 20 చెల్లిస్తే రూ.2లక్షల ప్రయోజనం..!

Pradhan Mantri Suraksha Bima Yojana: జీవితంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చాలా ముఖ్యమైనవి. అందుకే చాలామంది వీటిని తీసుకుంటున్నారు. కానీ ఇప్పటికీ గ్రామాల్లో వీటిపై సరైన అవగాహన లేదు. అయితే హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో పోలిస్తే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పర్వాలేదు. అనుకోనిది ఏదైనా జరిగితే కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రతి ఒక్కరు పాలసీ తీసుకుంటున్నారు. డబ్బున్నవారు ఎలాగైనా పాలసీ తీసుకుంటారు కానీ పేద ప్రజలకి ఇది భారంగా మారింది. అందుకే కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.20తో రూ.2 లక్షల ఇన్సూరెన్స్‌ని అందిస్తుంది. దీనిపేరే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

పీఎంఎస్ బీవై ని కొన్ని సవంత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా ఏడాదికి రూ. 20 ప్రీమియం చెల్లించి రూ. 2 లక్షల బీమా కవరేజీ పొందవచ్చు. పాలసీదారుడు అకాల మరణం చెందినా, యాక్సిడెంట్ లో వైకల్యం పొందినా కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు అందుతాయి. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు వారు ఈ ప్రభుత్వ బీమా పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. సంవత్సరానికి రూ. 20 ప్రీమియం చెల్లించాలి. బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం డిడక్ట్ అవుతుంది. సంబంధింత బ్యాంకు శాఖలో లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ పాలసీని తీసుకోవచ్చు.

ఈ పథకాన్ని 2015 లో ప్రారంభించారు. మొదట ప్రీమియం రూ. 12 గానే ఉండేది తర్వాత 2022 జూన్ 1 నుంచి రూ. 20 కి పెంచారు. దేశంలో తక్కువ ఆదాయం ఉన్న ప్రజలందరికీ జీవిత బీమా ఉండాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పాలసీ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు సమీప బ్యాంకు శాఖకు వెళ్లవచ్చు. లేదా బ్యాంక్ మిత్రా సేవల ద్వారా ఇంటి వద్దనే సర్వీస్ ను పొందవచ్చు. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఈ జీవితా బీమా పాలసీని అందిస్తున్నాయి. అందరికీ అందుబాటులో ఉండేందుకు కేంద్రం ఈ వెసులుబాటు కల్పించింది. ఇన్సూరెన్స్ ఏజెంట్ల ద్వారా కూడా ఈ పాలసీ ఎన్ రోల్ మెంట్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News