పెళ్లైన జంటకి అద్భుతమైన స్కీమ్‌.. నెలకి రూ. 200 డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.72000 పెన్షన్..!

PM Shrama Yogi Man Dhan Yojana: ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్‌ను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2019లో ప్రారంభించింది.

Update: 2022-11-24 11:24 GMT

పెళ్లైన జంటకి అద్భుతమైన స్కీమ్‌.. నెలకి రూ. 200 డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.72000 పెన్షన్..!

PM Shrama Yogi Man Dhan Yojana: ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్‌ను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2019లో ప్రారంభించింది. ఈ పథకం కింద వివాహిత జంట నెలకు రూ. 200 పెట్టుబడి పెట్టాలి. పదవీ విరమణ తర్వాత వారికి రూ. 72,000 వార్షిక పెన్షన్ లభిస్తుంది. దేశంలోని అనధికారిక రంగంలోని ఉద్యోగుల కోసం ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించారు. దీనిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

ఉదాహరణకు ఒక వ్యక్తికి 30 సంవత్సరాల వయస్సు ఉంటే ఈ పథకానికి నెలవారీ చందా రూ. 100 ఉంటుంది. ఆ విధంగా ఒక జంట నెలకు రూ. 200 చందా చెల్లించాలి. ఈ విధంగా ఆ దంపతుల వార్షిక సహకారం రూ.2,400 అవుతుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత దంపతులకు ఏటా రూ. 72,000 పెన్షన్ (జంటకు రూ. 72,000 వార్షిక పెన్షన్) లభిస్తుంది. అంటే ప్రతి చందాదారుడు 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత నెలకు రూ. 3,000 కనీస హామీ పెన్షన్ పొందుతాడు.

అర్హులు ఎవరు..?

అసంఘటిత కార్మికులు ఎక్కువగా వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, తల లోడింగ్ చేసేవారు, ఇటుక బట్టీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, గుడ్డలు ఉతికేవారు, ఇంటి కార్మికులు, చాకలి కార్మికులు, రిక్షా కార్మికులు, భూమిలేని కార్మికులు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ తయారీదారులు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు, ఆడియో-విజువల్ కార్మికులు, ఇతర సారూప్య వృత్తుల వారు అర్హులు.

నెలకు రూ. 15,000 లేదా అంతకంటే తక్కువ నెలవారీ ఆదాయం ఉండి 18 నుంచి 40 సంవత్సరాల ప్రవేశ వయస్సు గలవారు ఈ పథకానికి అర్హులు. ఈ కార్మికులు కొత్త పెన్షన్ స్కీమ్ (NPS), ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) స్కీమ్ లేదా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యులుగా ఉండకూడదని గుర్తుంచుకోండి.

పింఛను పొందుతున్న సమయంలో చందాదారుడు మరణిస్తే, లబ్దిదారుడి జీవిత భాగస్వామికి పెన్షన్‌లో 50% చెల్లిస్తారు. కుటుంబ పెన్షన్ జీవిత భాగస్వామికి మాత్రమే వర్తిస్తుంది. చందాదారుడు తప్పనిసరిగా మొబైల్ ఫోన్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్ కలిగి ఉండాలి. అర్హత కలిగిన సబ్‌స్క్రైబర్‌లు సమీపంలోని మీ సేవా సెంటర్‌ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు.

Tags:    

Similar News