Saving scheme: రిస్క్‌ లేకుండా రిటర్న్స్‌.. వడ్డీగా రూ. 2 లక్షలకుపైగా పొందొచ్చు..

ఈ పథకంలో కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న టెన్యూర్‌ ప్రకారం మెచ్యూరిటీ అనంతరం చేతికి డబ్బులొస్తాయి.

Update: 2024-07-04 15:00 GMT

ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ సేవింగ్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. ఖర్చు తర్వాత పొదుపు కంటే, పొదుపు చేసిన తర్వాతే ఖర్చు చేయాలనే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మారుతోన్న ఆర్థిక అవసరాలు, భవిష్యత్తుల్లో ఎదురయ్యే ఖర్చుల నేపథ్యంలో ప్రతీ ఒక్కరిలో ఆర్థిక క్రమ శిక్షణ పెరుగుతోంది. ఇందులో భాగంగానే రకరకాల పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలు సైతం మంచి పథకాలను అమలు చేస్తున్నాయి.

ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్‌ అందిస్తోన్న పథకాలు కూడా ఉన్నాయి. పోస్టాఫీస్‌ అందిస్తున్న బెస్ట్ సేవింగ్‌ స్కీమ్స్‌లో టైమ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ఈ పథకం బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే ఉంటుంది. ఇందులో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్లు ఇలా వేర్వేరు కాలవ్యవధులతో డిపాజిట్లు చేసుకోవచ్చు. ఏడాదికి 6.9 శాతం వడ్డీ, రెండేళ్లకు 7 శాతం, మూడేళ్లకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. గరిష్టంగా ఐదేళ్లకు 7.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.

ఈ పథకంలో కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న టెన్యూర్‌ ప్రకారం మెచ్యూరిటీ అనంతరం చేతికి డబ్బులొస్తాయి. ఇందులో సింగిల్‌ అకౌంట్‌ లేదా గరిష్టంగా ముగ్గురు కలిసి జాయింట్‌ అకౌంట్‌ తీసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఐదేళ్ల డిపాజిట్‌పై రూ. 5 లక్షలు డిపాజిట్ చేశారనుకుందాం. మీకు ఐదేళ్ల తర్వాత రూ. 7,24,974 పొందొచ్చు. అంటే ఐదేళ్లకు మీరు ఏకంగా రూ. 2 లక్షలకుపైగా వడ్డీ రూపంలోనే పొందొచ్చన్నమాట. ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 80సీ కింద పోస్టాఫీస్ ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై పన్ను తగ్గించుకోవచ్చు. దీంట్లో పెట్టుబడులపై గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు.

Tags:    

Similar News