Time Deposit: రిస్క్‌లేని పెట్టుబడికి ఈ స్కీమ్ బెటర్..!

Time Deposit: నేటికీ అధిక సంఖ్యలో ప్రజలు బ్యాంక్ ఎఫ్‌డి, ఎల్‌ఐసి, పోస్టాఫీసు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతారు.

Update: 2022-03-19 15:00 GMT

Time Deposit: రిస్క్‌లేని పెట్టుబడికి ఈ స్కీమ్ బెటర్..!

Time Deposit: నేటికీ అధిక సంఖ్యలో ప్రజలు బ్యాంక్ ఎఫ్‌డి, ఎల్‌ఐసి, పోస్టాఫీసు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతారు. దీనికి కారణం ఇందులో రిస్క్‌ తక్కువగా ఉంటుంది. మీ డబ్బుకి భద్రత ఉంటుంది. కానీ కరోనా సమయంలో బ్యాంక్ ఎఫ్‌డిల వడ్డీ రేట్లలో గణనీయమైన తగ్గుదల ఉంది. ఈ పరిస్థితిలో అందులో పెట్టుబడి పెట్టడం లాభదాయకం కాదు. చాలా బ్యాంకులు సాధారణ ప్రజలకు ఎఫ్‌డిపై 5.4 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఇది కాకుండా సీనియర్ సిటిజన్లు గరిష్ట వడ్డీ రేటును 6.7 శాతం వరకు మాత్రమే పొందుతున్నారు. ఈ పరిస్థితిలో మీరు పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ ఖాతా గురించి తెలుసుకోవాల్సి ఉంది.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెడితే సాధారణ ప్రజలు 6.7 శాతం వరకు వడ్డీ రేటును పొందుతారు. మరోవైపు సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో పెట్టుబడి పెడితే 7.4 శాతం వడ్డీ రేటును పొందుతారు. ఈ పథకంలో ఖాతాను సింగిల్ లేదా జాయింట్ మోడ్‌లో ఓపెన్‌ చేయవచ్చు. ఉమ్మడి ఖాతా ముగ్గురి పేర్లపై ఓపెన్ చేయవచ్చు. తల్లిదండ్రుల పర్యవేక్షణలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై కూడా మైనర్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఈ పథకంలో మీరు 1,2, 3, 5 సంవత్సరాల పాటు డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో, మీరు 1000 రూపాయల నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి ఎల్లప్పుడూ 100 గుణకారంలో ఉండాలి. ఈ పథకం కింద వార్షిక ప్రాతిపదికన వడ్డీ చెల్లిస్తారు.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతాలో పెట్టుబడి పెట్టిన తర్వాత మొదటి 6 నెలల వరకు మీరు ఖాతాను మూసివేయలేరు. మీరు 6 నెలల నుంచి ఒక సంవత్సరం లోపు ఖాతాను మూసివేస్తే మీకు వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. ఆ తర్వాత మెచ్యూరిటీకి ముందు ఖాతాను మూసివేస్తే మిగిలిన డబ్బుపై 2 శాతం వడ్డీ రేటును తగ్గించి చెల్లిస్తారు. ఖాతాదారు మరణించిన తర్వాత నామినీకి మొత్తం డబ్బు అందుతుంది. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతాలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతారు. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద ఈ మినహాయింపు లభిస్తుంది. మీరు దీని ద్వారా 1.5 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

Tags:    

Similar News