Post Office SCSS: సీనియర్‌ సిటిజన్స్‌కి ఈ పథకం ఓ వరం.. అత్యధిక వడ్డీ..

Post office Senior Citizens Savings Scheme: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌ పలు పథకాలను అందిస్తోంది. ఇందులో సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్‌ స్కీమ్‌.

Update: 2024-07-23 19:38 GMT

Post Office SCSS: సీనియర్‌ సిటిజన్స్‌కి ఈ పథకం ఓ వరం.. అత్యధిక వడ్డీ..

Post office Senior Citizens Savings Scheme: మారుతోన్న కాలానికి అనుగుణంగా ఆర్థిక అవసరాలు కూడా మారుతున్నాయి. పెరుగుతోన్న ఖర్చుల నేపథ్యంలో ముందు నుంచే పొదుపు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు ఖర్చులు పోను మిగిలిన దాన్ని పొదుపు చేసుకునే వారు. కానీ ప్రస్తుతం పొదుపు చేసిన తర్వాత మిగిలిందే ఖర్చు చేయాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో పెట్టుబడి పెట్టుకునేందుకు రకరకాల మార్గాలు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు పెట్టుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌ పలు పథకాలను అందిస్తోంది. ఇందులో సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్‌ స్కీమ్‌. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక అవసరాలను తీర్చేందుకు గాను ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి అత్యధికంగా వడ్డీ అందిస్తారు. ఈ పథకంలో 60 ఏళ్లు పైబడిన వారు పెట్టుబడి పెట్టొచ్చు. అదే 55 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్యన ఉన్న వ్యక్తులు ప్రత్యేక వీఆర్ఎస్ స్కీమ్ కింద పదవీ విరమణ చేసిన వ్యక్తి ఎస్‌సీఎస్ఎస్ ఖాతాను తెరవవచ్చు.

ఇక ఈ పథకాన్ని సింగిల్‌లా లేదా జీవిత భాగస్వామితో జాయింట్ అకౌంట్‌ను ఓపెన్‌ చేసుకోవచ్చు. సీనియర్‌ సీటిజన్లు ఈ ఖాతాను పోస్టాఫీస్‌లో పెన్‌ చేసుకోచ్చు. ఈ అకౌంట్‌లో కనిష్టంగా రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 30 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడ పెట్టిన వారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడికి ప్రస్తుతం 8.2 శాతం మూడు నెలల ప్రాతిపదికన వడ్డీ చెల్లిస్తారు

వడ్డీ డిపాజిట్ చేసిన తేదీ నుంచి మార్చి 31, 30 జూన్, 30 సెప్టెంబర్, 31 డిసెంబర్ వరకు ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి మొదటి వర్కింగ్ డే రోజున చెల్లిస్తారు. ఈ ఖాతా ఓపెన్‌ చేసిన 5 ఏళ్ల తర్వాత క్లోజ్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే మరో 3 ఏళ్లు ఖాతాను పొడగించుకోవచ్చు. ఇక కొన్ని కారణాల వల్ల అకౌంటను ఉన్నపలంగా క్లోజ్‌ చేయొచ్చు. ఉదాహరణకు మీరు పదవి విరమణ తర్వాత ఈ అకౌంట్‌లో రూ. 30 లక్షల పెట్టుబడి పెట్టారనుకుంటే.. రూ. 2.46 వార్షిక వడ్డీ పొందుతారు. అంటే సుమారు నెలకు రూ. 20వేలు వడ్డీ రూపంలో పొందుతారు.

Tags:    

Similar News