Post Office: పోస్టాఫీసు సూపర్ హిట్ స్కీం.. అత్యధిక వడ్డీ ఇందులోనే..!
Post Office: జీరో రిస్క్, గ్యారెంటీ రాబడి గురించి మాట్లాడినప్పుడల్లా ముందుగా గుర్తుకు వచ్చేది పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలు.
Post Office: జీరో రిస్క్, గ్యారెంటీ రాబడి గురించి మాట్లాడినప్పుడల్లా ముందుగా గుర్తుకు వచ్చేది పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలు. ఈ స్కీమ్‌లలో డబ్బు నష్టపోవడం అనేది అస్సలు ఉండదు. మార్కెట్ హెచ్చుతగ్గుల ఒత్తిడి ఉండదు. పోస్ట్ ఆఫీస్ పథకాలలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఒకటి. ఈ పథకంలో గరిష్టంగా 15 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 7.4 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తోంది.
మీరు సీనియర్ సిటిజన్స్ స్కీమ్‌లో ఒకేసారి రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల తర్వాత అంటే మెచ్యూరిటీపై సంవత్సరానికి 7.4 శాతం (కంపౌండింగ్) వడ్డీ రేటుతో మొత్తం రూ.20,55,000 అవుతుంది. అంటే ఇక్కడ మీరు వడ్డీగా రూ.5.55 లక్షల ప్రయోజనాన్ని పొందుతారు. ఈ విధంగా ప్రతి త్రైమాసిక వడ్డీ రూ.27,750 అవుతుంది. పోస్టాఫీసు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు.
రూ.1000 గుణింతాల్లో డిపాజిట్లు చేయవచ్చు. అలాగే ఇందులో గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాలని గుర్తుంచుకోండి. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి SCSS కింద ఖాతాను తెరవవచ్చు. ఎవరైనా 55 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండి 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే లేదా VRS తీసుకున్నట్లయితే అతను SCSSలో ఖాతాను తెరవవచ్చు.