Post Office: సీనియర్‌ సిటిజన్లకి బెస్ట్‌ స్కీమ్‌.. అధిక వడ్డీ ఆఫర్..!

Post Office: సీనియర్‌ సిటిజన్లకి బెస్ట్‌ స్కీమ్‌.. అధిక వడ్డీ ఆఫర్..!

Update: 2022-07-11 11:30 GMT

Post Office: సీనియర్‌ సిటిజన్లకి బెస్ట్‌ స్కీమ్‌.. అధిక వడ్డీ ఆఫర్..!

Post Office: పోస్ట్ ఆఫీస్ అందించే చిన్న పొదుపు పథకాలు పెట్టుబడికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. డిపాజిట్ పూర్తిగా సురక్షితంగా ఉండటమే కాకుండా గ్యారెంటీ రిటర్న్‌ అందిస్తాయి. ఈ పెట్టుబడులపై మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం ఉండదు. పోస్టాఫీసు అనేక రకాల డిపాజిట్ పథకాలను అందిస్తుంది. ఇందులో పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)ఒకటి. ఇందులో అత్యధిక వడ్డీ చెల్లిస్తోంది. ఈ స్కీమ్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

మీరు సీనియర్ సిటిజన్స్ స్కీమ్‌లో ఒకేసారి రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే ఏడాదికి 7.4 శాతం (కంపౌండింగ్) వడ్డీ రేటుతో 5 సంవత్సరాల తర్వాత అంటే మెచ్యూరిటీపై మొత్తం రూ. 6,85,000 అవుతుంది. ఇక్కడ మీరు వడ్డీగా రూ. 1,85,000 ప్రయోజనం పొందుతున్నారు. అంతే ప్రతి త్రైమాసిక వడ్డీ రూ.9,250 అవుతుంది. పోస్టాఫీసు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ పథకంపై వార్షిక వడ్డీ 7.4% ఉంటుంది. ఈ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. రూ.1000 గుణింతాల్లో డిపాజిట్లు చేయవచ్చు.అలాగే ఇందులో గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

SCSS కింద 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి ఖాతాను తెరవవచ్చు. ఎవరైనా 55 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండి 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే అంటే VRS తీసుకున్నట్లయితే అతను SCSSలో ఖాతాను తెరవవచ్చు. కానీ పదవీ విరమణ ప్రయోజనాలను స్వీకరించిన ఒక నెలలోపు ఈ ఖాతాను తెరవాలి. ఇందులో డిపాజిట్ చేసిన మొత్తం రిటైర్మెంట్ ప్రయోజనాల మొత్తాన్ని మించకూడదు. 1 లక్ష కంటే తక్కువ మొత్తంతో, ఖాతాను నగదు రూపంలో తెరవవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ, చెక్కును ఉపయోగించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News