Post Office: ఐదేళ్లలో రూ. 3.6 లక్షలు.. పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్‌..!

Post Office: మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పొదుపు చేసే వారి సంఖ్య పెరుగుతోంది.

Update: 2024-10-09 15:00 GMT

Post Office: ఐదేళ్లలో రూ. 3.6 లక్షలు.. పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్‌..!

Post Office: మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పొదుపు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. సంపాదన మొదలుపెట్టిన రోజు నుంచే డబ్బు సేవింగ్స్‌ ప్రారంభిస్తున్నారు. అయితే ఈ క్రమంలో రిస్క్‌ లేని మార్గాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారికి పోస్టాఫీస్‌ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ప్రతి నెల కొంత మొత్తంలో సేవ్‌ చేసుకోవాలనుకునే వారి కోసం ఒక మంచి పథకం అందుబాటులో ఉంది. అదేంటి.? దాని వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టాఫీస్‌ అందిస్తున్న ఈ పథకం పేరు రికరింగ్ డిపాజిట్‌ (RD). ఈ పథకం వ్యవధి ఐదేళ్లు ఉంటుంది. అవసరమైతే మరో పదేళ్ల పాటు పెంచుకోవచ్చు. అయితే మూడేళ్లకు కూడా క్లోజ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. గతంలో 6.7 శాతంగా ఉన్న ఈ వడ్డీని ప్రభుత్వం ఇప్పుడు పెంచింది. ప్రతీ 3 నెలలకు వడ్డీ రేటును నిర్ణయిస్తాయి.

ఉదాహరణకు ప్రతి నెల మీరు రూ. 5000 పెట్టుబడి పెడితే ఎంత డబ్బు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ప్రతి నెల రూ. 5000 చొప్పున డిపాజిట్ చేస్తూ పోతుంటే.. ఐదేళ్లకు మీరు మొత్తం రూ. 3 లక్షలు పెట్టుబడి పెడుతారు. దీనికి మీకు రూ. 64,448 వడ్డీ లభిస్తుంది. దీంతో మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ. 3,64,448 పొందొచ్చు. ఒకవేళ మీరు నెలకు రూ. వెయ్యి చొప్పున సేవింగ్ చేస్తూ పోతే మీకు రూ. 72,886 లభిస్తుంది. అలాగే నెలకు రూ. 3000 చొప్పున జమ చేస్తూ పోతే రూ. 2,18,666 పొందొచ్చు. పూర్తి వివరాల కోసం ఈ పథకాన్ని ప్రారంభించాలనుకునే వారి స్థానికంగా ఉన్న పోస్టాఫీస్‌ బ్రాంచ్‌ను సంప్రదించాలి. 

Tags:    

Similar News