Investment Idea: రిస్క్ లేకుండా ప్రతీనెలా రూ.5000 కావాలా.. ఈ స్కీంని మించినది మరొకటి లేదు..!

Investment Idea: రోజూవారీ కూలీలు, ప్యాక్టరీలలో పనిచేసే కార్మికులు, వివిధ రకాల పనులు చేసే మహిళలు కష్టపడి పనిచేస్తూ చిన్న మొత్తాలను కూడబెట్టుకుంటారు.

Update: 2024-06-01 01:30 GMT

Investment Idea: రిస్క్లేకుండా ప్రతీనెలా రూ.5000 కావాలా.. ఈ స్కీంని మించినది మరొకటి లేదు..!

Investment Idea: రోజూవారీ కూలీలు, ప్యాక్టరీలలో పనిచేసే కార్మికులు, వివిధ రకాల పనులు చేసే మహిళలు కష్టపడి పనిచేస్తూ చిన్న మొత్తాలను కూడబెట్టుకుంటారు. ఇలాంటి వారు ప్రస్తుతం మార్కెట్లో నడిచే ఇన్వెస్ట్మెంట్ స్కీంలని నమ్మరు. వీరు వారి ఆదాయానికి భద్రత కోరుకుంటారు. రిస్క్లేకుండా నెలకు ఎంతో కొంత మొత్తం వస్తే చాలనుకుంటారు. అలాంటి వారికోసం పోస్టాఫీసు పొదుపు స్కీంలు ఎంతోగానో ఉపయోగపడుతాయి. నెలకు రూ.5000 కావాలనుకునే వ్యక్తులు పోస్టాఫీసు మంత్లీ ఇనకమ్ స్కీంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో ఒక్కసారి ఇన్వెస్ట్ చేయాలి. దీంతో స్థిరమైన నెలవారీ ఆదాయం పొందవచ్చు. ఈ పథకంలో వడ్డీ రేటు 7.4 శాతం ఉంటుంది. మీ పెట్టుబడిని బట్టి మీరు పొందే ఆదాయం ఉంటుంది. ఒక వ్యక్తి ఈ పథకంలో రూ. 9లక్షల వరకు పెట్టుబడి పెడితే ఐదేళ్లపాటు ప్రతినెలా రూ. 5,500 పొందే అవకాశం ఉంటుంది. అదే రూ. 9లక్షల పెట్టుబడి పెడితే వడ్డీ రేటు 7.4శాతంతో ఐదేళ్లలో రూ. 3.33 లక్షలు వస్తాయి. అంటే నెలకు రూ. 5,500 పొందుతారు. ఈ పథకం ఉమ్మడి ఖాతా సౌకర్యాన్ని అందిస్తుంది. అంటే ఈ పథకంలో గరిష్టంగా రూ. 15లక్షలు డిపాజిట్ చేయవచ్చు.

ఈ స్కీంపై వచ్చే ఆదాయంలో టీడీఎస్ కటింగ్ ఉండదు. అయితే మీరు పొందే వడ్డీపై స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. అత్యవసర సమయంలో మనీ అవసరమైతే ఏడాది తర్వాత తీసుకోవచ్చు. అయితే ఫ్రీ మెచ్యూర్ క్లోజర్ విషయంలో పెనాల్టీ చెల్లించాలి. అందుకే ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేయాలంటే కచ్చితంగా ఐదేళ్లు ఆ డబ్బు గురించి ఆలోచించని వారైతే చేయాలి. లేదంటే ఇబ్బందుల్లో పడుతారు. ఇలాంటి వారికి వడ్డీ కలిసి వస్తుంది. నెలా నెలా అకౌంట్లో పడుతుంది.

Tags:    

Similar News