Post Office: ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
Post Office: సురక్షితమైన పెట్టుబడులకి నెలవు పోస్టాఫీసు. ఇందులో మీ డబ్బు భద్రంగా ఉంటుంది.
Post Office: సురక్షితమైన పెట్టుబడులకి నెలవు పోస్టాఫీసు. ఇందులో మీ డబ్బు భద్రంగా ఉంటుంది. జీరో రిస్క్‌తో భారీ లాభాలను పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ కింద దీర్ఘకాలిక పెట్టుబడిని కోరుకుంటే పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకం ఉత్తమమైనది. ఇందులో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఎటువంటి ప్రమాదం ఉండదు. ఈ సూపర్‌హిట్ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
కిసాన్ వికాస్ పత్ర పథకం అనేది భారత ప్రభుత్వం పెట్టుబడి పథకం. దీని కింద మీ డబ్బు నిర్ణీత వ్యవధిలో రెట్టింపు అవుతుంది. దేశంలోని అన్ని పోస్టాఫీసులు, పెద్ద బ్యాంకుల్లో ఈ పథకం అమలుచేస్తున్నారు. దీని మెచ్యూరిటీ కాలం 124 నెలలు.ఇందులో కనీసం 1000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. అయితే దీని కింద గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. మీరు రూ.1000, రూ.5000, రూ.10,000, రూ.50,000 పత్రాలని కొనుగోలు చేయవచ్చు.
ఈ పథకంలో పెట్టుబడికి పరిమితి లేదు. కాబట్టి మనీ లాండరింగ్ ప్రమాదం ఉంటుంది. అందుకే ఇందులో రూ.50,000 కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం పాన్ కార్డును తప్పనిసరి చేసింది. దీంతో పాటు గుర్తింపు కార్డుగా ఆధార్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెడితే మీరు ITR, జీతం స్లిప్, బ్యాంక్ స్టేట్‌మెంట్ పత్రాలని సమర్పించాల్సి ఉంటుంది.