Post Office Investment Schemes: అధిక వడ్డీ.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్స్.. పెట్టుబడి డబుల్..!

Post Office Investment Schemes: పోస్టాఫీస్‌లో అధిక వడ్డీని అందించే మూడు పథకాలు ఉన్నాయి. ఇవి 7.5 శాతం వడ్డీని అందిస్తాయి.

Update: 2024-08-07 11:30 GMT

Post Office Investment Schemes

Post Office Investment Schemes: ప్రజలు ఆర్థికంగా సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యం. భవిష్యత్తులో మీరు ఎటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోకుండా ఉండటానికి ఇవాల్టి నుంచే సిద్థంగా ఉండాలి. మిమ్మల్ని మీరు బలంగా ఉంచుకోవడానికి సరైన స్థలంలో పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుత కాలంలో మీకు ఎక్కువ లాభాలు ఇచ్చే అనేక పెట్టుబడి ఆప్షన్స్ ఉన్నాయి. అయితే మీరు రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే పోస్టాఫీసులో 3 ప్రత్యేకమైన పథకాలు ఉన్నాయి. ఇవి 7 శాతం వడ్డీని అందిస్తాయి. ఈ పథకాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Post Office Time Deposit Scheme
పోస్టాఫీసు అనేక ప్రత్యేక పథకాల ప్రయోజనాలను అందిస్తుంది. వాటిలో ఒకటి ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం. టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. ఈ పథకాన్ని నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అని కూడా అంటారు. 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు కాలపరిమితి కలిగిన 4 రకాల ప్లాన్‌లు ఉన్నాయి. ఇవి 6.9 శాతం రాబడితో పాటు ఈ పథకం 7.5 శాతం, 7.1 శాతం, 7.0 శాతం వడ్డీ రేట్లను కూడా అందిస్తుంది. మీరు ఈ పథకంలో కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టవచ్చు.

Post Office Senior Citizen Savings Scheme
పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) కూడా పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది. ఇందులో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లు ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల వార్షికంగా 8.2 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పథకం కనీస పెట్టుబడి రూ. 1 వేయి, గరిష్ట పెట్టుబడి రూ. 30 లక్షల వరకు ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచుకోవచ్చు.

Mahila Samman Savings Certificate
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) అనేది మహిళల కోసం ఒక ప్రత్యేక పథకం. మహిళలు తమను తాము ఆర్థికంగా సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అధిక వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలతో వచ్చే సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌లో మహిళలు కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

Tags:    

Similar News