Post Office: 5 ఏళ్లలో రూ. 7 లక్షలకుపైగా పొందే అవకాశం.. పోస్టాఫీస్‌లో సూపర్‌ స్కీమ్‌..!

Time Deposit Scheme: ప్రస్తుతం పోస్టాఫీస్‌లు బ్యాంక్‌లతో పోటీపడీ మరీ పథకాలను అందిస్తున్నాయి.

Update: 2024-10-11 08:30 GMT

Post Office: 5 ఏళ్లలో రూ. 7 లక్షలకుపైగా పొందే అవకాశం.. పోస్టాఫీస్‌లో సూపర్‌ స్కీమ్‌..!

Time Deposit Scheme: ప్రస్తుతం పోస్టాఫీస్‌లు బ్యాంక్‌లతో పోటీపడీ మరీ పథకాలను అందిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ సమయంలో మంచి లాభాలు ఆర్జించే విధంగా పథకాలను అమలు చేస్తున్నాయి. మారిన ఆర్థిక అవసరాల నేపథ్యంలో ఇలాంటి పథకాల్లో పెట్టుబడులు పెడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాంటి వారి కోసమే పోస్టాఫీస్‌ తాజాగా అదిరిపోయే ఓ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటా పథకం.? ఇందులో ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టాఫీస్‌ అందిస్తోన్న ఈ పథకం పేరు టైమ్ డిపాజిట్ స్కీమ్‌. దీనికి పోస్టాఫీస్‌ ఎఫ్‌డీగా కూడా పిలుస్తుంటారు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలనునుకునే వారు 1,2,3,5 ఏళ్ల కాలవ్యవధితో పెట్టొచ్చు. అయితే ఐదేళ్ల కాల వ్యవధితో పెట్టుబడి పెట్టేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్లపాటు విత్‌డ్రా చేయకూడదు. ఒకవేళ మీరు ఈ పథకాంలో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత లాభం పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదాహరణకు మీరు ఐదేళ్ల కాల వ్యవధితో రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మీకు ఈ డిపాజిట్‌పై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. దీంతో ఐదేళ్లలో మీకు కేవలం వడ్డీ రూపంలోనే రూ. 2,24,974 లభిస్తుంది. దీంతో మీరు పెట్టిన పెట్టుబడితో కలిపి మొత్తం రూ. 7,24,974 పొందొచ్చు. ఈ పథకంలో సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది.

అయితే 5 ఏళ్లు కాకుండా ముందుగా ఎఫ్‌డీని క్లోజ్‌ చేసినట్లయితే.. టైమ్ డిపాజిట్‌పై వర్తించే ప్రస్తుత వడ్డీ రేటు నుండి 2శాతం వడ్డీని తీసివేసిన తర్వాత డబ్బు మీకు తిరిగి వస్తుంది. అంటే, మీరు 7.5% చొప్పున వడ్డీని పొందుతున్నట్లయితే, మెచ్యూర్‌కు ముందు అకౌంట్ మూసివేస్తే , ఈ వడ్డీ 5.5శాతానికి తగ్గుతుందన్నమాట. ఈ పథకంలో కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. ఖాతా తెరిచే సమయంలో ఏ వడ్డీ రేటు ఉంటుందో, ఖాతా కాలవ్యవధి పూర్తయ్యే వరకు అదే వడ్డీ రేటు వర్తిస్తుంది. ఖాతా తెరిచిన తేదీ నుండి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత వడ్డీ మీ ఖాతాలో జమ అవుతుంది.

Tags:    

Similar News