PNB: పీఎన్‌బీ కస్టమర్లు అలర్ట్‌.. కొత్త నిబంధనలు తెలిస్తే షాక్ అవుతారు..!

PNB: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు అలర్ట్.. మారిన కొత్త నిబంధనల గురించి తెలుసుకోండి.

Update: 2022-03-19 10:51 GMT

PNB: పీఎన్‌బీ కస్టమర్లు అలర్ట్‌.. కొత్త నిబంధనలు తెలిస్తే షాక్ అవుతారు..!

PNB: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు అలర్ట్.. మారిన కొత్త నిబంధనల గురించి తెలుసుకోండి. ఈ సమాచారం PNB వెబ్‌సైట్‌లో ఇచ్చారు. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని PNB కస్టమర్‌లు తమ ఖాతాలో కనీసం10 వేల రూపాయలు బ్యాలెన్స్‌గా ఉంచుకోవాలి. PNBలో పట్టణ ప్రాంతాల్లో సగటు బ్యాలెన్స్ కనీస పరిమితిని త్రైమాసిక ప్రాతిపదికన రూ.5000 నుంచి రూ.10,000కి పెంచారు. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు గతంలో రూ.300గా ఉన్న ఛార్జీ కూడా రెట్టింపు అయి రూ.600కి చేరింది.

గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల ఖాతాలకు త్రైమాసిక ప్రాతిపదికన కనీస నిల్వను నిర్వహించనట్లయితే ఛార్జీ రూ. 400. PNB గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలకు కనీస బ్యాలెన్స్ పరిమితిని రూ.1000గా నిర్ణయించింది. లాకర్ ఛార్జీలలో వచ్చిన మార్పులు అన్ని రకాల లాకర్లను ప్రభావితం చేశాయి. చిన్న సైజు లాకర్ చార్జీ గతంలో గ్రామీణ ప్రాంతాల్లో 1000 రూపాయలు ఉండగా జనవరి 15 నుంచి 1250 రూపాయలకు పెరిగింది. అర్బన్ ఏరియాల్లో ఈ ఛార్జీ రూ.2000కి పెరిగింది.

గ్రామీణ ప్రాంతాల్లో మీడియం సైజ్ లాకర్ ఛార్జీ రూ.2 వేల నుంచి రూ.2,500కి, పట్టణ ప్రాంతాల్లో రూ.3 వేల నుంచి రూ.3,500కి పెరిగింది. పెద్ద లాకర్ చార్జీ గ్రామీణ ప్రాంతాల్లో 2.5 వేల నుంచి 3 వేలకు, పట్టణ ప్రాంతాల్లో 5 వేల నుంచి 5,500 రూపాయలకు పెరిగింది. చాలా పెద్ద లాకర్‌కు రూ. 10,000 రూరల్, అర్బన్ రెండింటికీ వసూలు చేస్తారు. ఇందులో ఎలాంటి మార్పు చేయలేదు. PNB లాకర్ హోల్డర్లు ఇప్పుడు ఒక సంవత్సరంలో లాకర్‌కి 12 ఉచిత సందర్శనలు చేయవచ్చు. 13వ సందర్శన నుంచి ప్రతి సందర్శనకు రూ.100 ఛార్జ్ చేస్తారు. గతంలో ఈ పరిమితి 15 సందర్శనలుగా ఉండేది. అలాగే ఖాతా మూసివేసే ఛార్జీలను కూడా పెంచింది. కరెంట్ ఖాతాను తెరిచిన 14 రోజుల కంటే ఎక్కువ రోజులు అంటే ఒక సంవత్సరంలోపు మూసివేస్తే దాని ఛార్జీ ఇంతకు ముందు రూ.600గా ఉంది. ఇప్పుడు జనవరి 15 నుంచి రూ.800కి పెరిగింది. 

Tags:    

Similar News