పీఎన్‌బీ, యాక్సిస్‌ బ్యాంకు ఖాతాదారులు అలర్ట్‌.. ఏప్రిల్‌ నుంచి మారుతున్న నిబంధనలు..!

పీఎన్‌బీ, యాక్సిస్‌ బ్యాంకు ఖాతాదారులు అలర్ట్‌.. ఏప్రిల్‌ నుంచి మారుతున్న నిబంధనలు..!

Update: 2022-03-31 05:30 GMT

పీఎన్‌బీ, యాక్సిస్‌ బ్యాంకు ఖాతాదారులు అలర్ట్‌.. ఏప్రిల్‌ నుంచి మారుతున్న నిబంధనలు..!

PNB Axis Bank: SBI తర్వాత ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా దాని చెల్లింపునకి సంబంధించిన నిబంధనలను మార్చబోతోంది. మీరు PNB కస్టమర్ అయితే ఈ వార్త మీ కోసమే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)ఇప్పుడు పాజిటివ్ పే సిస్టమ్ (PPS)ని అమలు చేయబోతోంది. PNB కంటే ముందే చాలా బ్యాంకులు ఈ పద్దతిని అమలు చేశాయి. వచ్చే ఏప్రిల్ 4 నుంచి ఈ నిబంధనను తప్పనిసరి చేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఇది కాకుండా యాక్సిస్ బ్యాంక్ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి తన నిబంధనలను మారుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.

యాక్సిస్ బ్యాంక్ కొత్త రూల్స్

యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక. ఏప్రిల్ 1 నుంచి పొదుపు ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ పరిమితి పెరగనుంది. కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత పొదుపు ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు పెరగనుంది. బ్యాంక్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఉచిత నగదు లావాదేవీల పరిమితిని కూడా నాలుగు ఉచిత లావాదేవీలు లేదా రూ. 1.5 లక్షలకు కుదించారు.

PPS వ్యవస్థ అంటే ఏమిటి..?

PPS వ్యవస్థ అనేది మోసాన్ని నిరోధించడానికి రూపొందించిన ఒక భద్రత వ్యవస్థ. ఈ విధానంలో చెక్కు జారీ చేసినప్పుడు ఖాతాదారుడు పూర్తి వివరాలను బ్యాంకుకు అందించాలి. ఈ సమాచారంలో చెక్కు తేదీ, లబ్ధిదారు పేరు, ఖాతా నంబర్, SMS,నెట్ బ్యాంకింగ్, ATM లేదా మొబైల్ బ్యాంకింగ్ మొత్తం సమాచారం అందించాల్సి ఉంటుంది. దీనివల్ల చెక్ క్లియరెన్స్‌కి తక్కువ సమయం పడుతుంది.

Tags:    

Similar News