ఈ ప్రభుత్వ పథకం కింద 50,000 నుంచి 10 లక్షల వరకు రుణాలు..!
PM Mudra Loan: మీరు బిజినెస్(Business) ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది.
PM Mudra Loan: మీరు బిజినెస్(Business) ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇందులో మీరు రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని అమలు చేస్తుంది. అందులో ప్రధాన మంత్రి ముద్రా యోజన(PM Mudra Yojana) ఒకటి. ఈ పథకం కింద మీకు రుణం మంజూరు చేస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి హామీ లేకుండా రుణాన్ని పొందుతారు. అంతేకాదు ప్రాసెసింగ్ రుసుము(Processing Fee) కూడా ఉండదు.
ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద ఎటువంటి స్థిర వడ్డీ రేటు ఉండదు. ముద్రా రుణాలకు బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లు(Interest Rates) విధిస్తుంది. సాధారణంగా కనీస వడ్డీ రేటు 12 శాతం. మీరు PM ముద్రా లోన్ ప్రయోజనాన్ని 3 దశల్లో పొందవచ్చు. ఇందులో మొదటి దశ శిశు రుణం. రెండవ దశ కిషోర్ లోన్, మూడవ దశ తరుణ్ లోన్.
1. శిశు రుణ పథకం- ఈ పథకం కింద మీరు రూ. 50,000 వరకు రుణం పొందుతారు.
2. కిషోర్ లోన్ స్కీమ్- ఈ పథకంలో లోన్ మొత్తం రూ. 50,000 నుంచి రూ. 5 లక్షల వరకు ఉంటుంది.
3. తరుణ్ లోన్ స్కీమ్- తరుణ్ లోన్ స్కీమ్‌లో రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది.
చిన్న వ్యాపారుల కోసం ప్రత్యేకంగా ఈ పథకం రూపొందించారు. ఉదాహరణకు - దుకాణదారులు, పండ్లు / కూరగాయల విక్రయదారులు, చిన్న తరహా పరిశ్రమలు, ఆహార-సేవ యూనిట్లు, మెకానిక్ షాపులు, యంత్ర కార్యకలాపాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఈ పథకం కింద పొందవచ్చు. మీరు ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల నుంచి ఎక్కడి నుంచైనా ఈ రుణాన్ని తీసుకోవచ్చు. 27 ప్రభుత్వ బ్యాంకులు, 17 ప్రైవేట్ బ్యాంకులు, 31 గ్రామీణ బ్యాంకులు, 4 సహకార బ్యాంకులు, 36 మైక్రో ఫైనాన్స్ సంస్థలు, 25 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) ముద్రా రుణాలను పంపిణీ చేయడానికి RBI అధికారం ఇచ్చింది.
రుణం ఎలా పొందాలి?
మీరు లోన్ తీసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ http://www.mudra.org.in/ని సందర్శించవచ్చు. ఇక్కడ నుంచి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు అన్ని వివరాలను అందించాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మీ నుంచి పని గురించి సమాచారాన్ని తీసుకుంటారు. దాని ఆధారంగా PMMY మీకు రుణాన్ని మంజూరు చేస్తుంది.