ఈ స్కీమ్ కింద 10 లక్షల ప్రయోజనం.. మహిళలకు చాలా సులువు..?
PMMY: మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే అందుకోసం డబ్బు సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ప్రభుత్వ సహాయంతో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
PMMY: మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే అందుకోసం డబ్బు సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ప్రభుత్వ సహాయంతో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. PM ముద్రా లోన్ స్కీమ్ అనేది మీరు లోన్ పొందగలిగే ప్రభుత్వ పథకం. ప్రత్యేకించి మీ ఇంట్లోని మహిళల పేరుపై సులువుగా లోన్ పొందవచ్చు. ఈ పథకం ప్రయోజనాలు, లోన్ దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఈ పథకం కింద దరఖాస్తుదారుడు 50 వేల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. ఇందులో 3 రకాల రుణాలు ఇస్తారు. మొదటి శిశు, రెండోది కిషోర్, మూడోది తరుణ్ లోన్. శిశు లోన్‌లో రూ.50,000 వరకు రుణం లభిస్తుంది. కాగా కిషోర్ రుణంలో 50 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు, తరుణ్‌లో 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తారు. దరఖాస్తుదారు తను ఏ రుణం తీసుకోవాలనుకుంటున్నారో స్వయంగా నిర్ణయించుకోవచ్చు.
ప్రస్తుతం దేశంలో మహిళల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మీ ఇంట్లోని మహిళపై రుణం తీసుకుంటే బెస్ట్. వాస్తవానికి మహిళలైనా, పురుషుడైనా ఎవరైనా ఈ పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఎంచుకున్న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలి. లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పథకం సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు తెలియజేస్తారు. అంతేకాదు ఆన్‌లైన్‌లో కూడా వివరాలు తెలుసుకోవచ్చు. వ్యాపారం ప్రారంభించే వ్యక్తి వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. అంతేకంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తికి రుణం మంజూరుకాదు.
లోన్ కోసం ముందుగా వెబ్‌సైట్ http://www.mudra.org.in/ ని సందర్శించడం ద్వారా అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ శిశు రుణం కోసం ఫారమ్ కొంచెం భిన్నంగా ఉంటుంది. అయితే తరుణ్, కిషోర్ రుణం కోసం ఫారమ్ ఒకేలా ఉంటుంది. దరఖాస్తు ఫారమ్‌లో మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పేరు, చిరునామా మొదలైన వివరాలను తెలపాలి. మీ పాస్‌పోర్ట్ ఫోటోను జత చేయాలి. ఫారమ్ నింపిన తర్వాత ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంక్‌కి వెళ్లి అన్ని పనులని పూర్తి చేయాలి. బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మీ నుంచి పని గురించి సమాచారాన్ని తీసుకుంటారు. దాని ఆధారంగా PMMY మీకు రుణాన్ని మంజూరు చేస్తుంది.