EPFO: పీఎఫ్ ఖాతాదారులకి శుభవార్త.. ఇప్పుడు ఈ సదుపాయం రెట్టింపు..!
EPFO: పీఎఫ్ ఖాతాదారులకి శుభవార్త.. ఇప్పుడు ఈ సదుపాయం రెట్టింపు..!
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) వేతన జీవులకి అత్యవసర సమయాలలో బాగా ఉపయోగపడుతుంది. పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం ఆన్లైన్ సౌకర్యం కల్పించినప్పటి నుంచి సామాన్యులు ఎంతో ఉపశమనం పొందారు. గతంలో అయితే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయాలంటే చాలా రోజులు వేచి ఉండాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కొన్ని గంటల్లోనే మీ ఖాతాలోకి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇది మాత్రమే కాదు మీకు కావాలంటే మీరు పిఎఫ్ నుంచి రెట్టింపు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.
పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ల దృష్ట్యా, ఇప్పుడు ఉద్యోగులు తమ పిఎఫ్ ఖాతా నుంచి రెట్టింపు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది. వాస్తవానికి ఇంతకుముందు ఈపీఎఫ్వోఉద్యోగులకు తిరిగి చెల్లించని అడ్వాన్స్‌కి అనుమతి ఇచ్చింది. అయితే ఈ సదుపాయం ఇప్పుడు రెండుసార్లు కల్పిస్తోంది. అంటే కరోనా సమస్య ఉన్న ఉద్యోగి ఈ ఫండ్‌ను రెండుసార్లు విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. కానీ గతంలో ఈ సదుపాయం ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉండేది. వాస్తవానికి మెడికల్ ఎమర్జెన్సీ కింద ప్రభుత్వం ఈ ప్రత్యేక సదుపాయం కల్పిస్తోంది. ఏ ఉద్యోగి ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రెండు సార్లు అడ్వాన్స్ పొందడానికి ఏర్పాట్లు చేసింది. ఈ ప్రక్రియ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1: దీని కోసం సభ్యుల ఈ-సేవ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ కి వెళ్లాలి.
2: మీ UAN, పాస్వర్డ్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా మీ ఖాతాకు లాగిన్ అవండి.
3: ఇప్పుడు ఆన్లైన్ సేవలకు వెళ్లి అక్కడ మీ క్లెయిమ్‌ను ఎంచుకోండి.
4: ఇప్పుడు మీ స్క్రీన్‌పై కొత్త వెబ్‌పేజీ కనిపిస్తుంది. ఇందులో మీ పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్లోని చివరి నాలుగు అంకెలు నమోదు చేయాలి.
5: ఇక్కడ మీ బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఎంటర్ చేసి 'వెరిఫై'పై క్లిక్ చేయండి.
6 : మీ స్క్రీన్‌పై పాప్-అప్ కనిపిస్తుంది. 'సర్టిఫికేట్ ఆఫ్ అండర్‌టేకింగ్' అందించమని మిమ్మల్ని అడుగుతుంది.
7: డ్రాప్ డౌన్ మెను నుంచి మీరు 'PF అడ్వాన్స్ (ఫారం 31)' ఎంచుకోవాలి.
8: డ్రాప్ డౌన్ మెను నుంచి మీరు డబ్బును విత్‌డ్రా చేయడానికి 'పాండమిక్ వ్యాప్తి (COVID-19)' ఫారమ్‌ను ఎంచుకోవాలి.
9: అవసరమైన మొత్తాన్ని ఎంటర్ చేయండి. చెక్కు స్కాన్ చేసిన కాపీని అప్లోడ్ చేయండి. మీ చిరునామాను ఎంటర్ చేయండి.
10: ఇప్పుడు మీ ఆధార్‌తో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) వస్తుంది. దానిని ఎంటర్ చేయండి. పని పూర్తవుతుంది.