Petrol Rate: పెట్రో ధరల మోత వినియోగదారులకు వాత

Update: 2021-02-15 04:55 GMT

పెట్రోల్ రేట్ (ప్రతీకాత్మక చిత్రం:హన్స్ ఇండియా)

దేశంలోని మెట్రోనగరాల్లో పెట్రో ధరలు వంద రూపాయల చేరువకు చేరి సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్నాయి. వరుసగా ఏడో రోజు ఇంధన ధరలు పెరిగి సరికొత్త గరిష్ఠాలను తాకాయి. గత వారం రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూపాయి 95 పైసలు, డీజిల్ లీటరుకు రూపాయి 65 పైసలు చొప్పున పెరిగాయి. పెట్రోలియం కంపెనీలు తాజాగా పెట్రోల్ పై 23 నుంచి 25 పైసలు, డీజిల్ పై 28 నుంచి 30 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 88 రూపాయల 99 పైసలు, డీజిల్ 79 రూపాయల 35 పైసలు వద్దకు చేరాయి. ఆర్దిక రాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 95 రూపాయల 46 పైసలుగా నమోదవుతోంది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 92 రూపాయల 53 పైసలు, డీజిల్ 86 రూపాయల 55 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News