సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్న పెట్రోల్ ధరలు

* మంగళవారం మరోమారు పెరిగిన పెట్రో ధరలు... * ముంబై లో 93 రూపాయల ఎగువన లీటర్ పెట్రోల్ ధర..

Update: 2021-02-09 06:04 GMT

దేశంలోని మెట్రోనగరాల్లో పెట్రో ధరలు ఆల్ టైమ్ హై కి చేరి సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్నాయి మూడు రోజులుగా నిలకడగా స్థిరంగా వున్న పెట్రో ధరలు మరోమారు పెరిగాయి. పెట్రోలియం కంపెనీలు మంగళవారం పెట్రోల్ - డీజిల్ ధరలను మరో 30 పైసల మేర పెంచడంతో వాహనదారులకు చుక్కలు తప్పడం లేదు రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 87 రూపాయల 30 పైసలు, డీజిల్ 77 రూపాయల 48 పైసలు వద్దకు చేరాయి. ఆర్దిక రాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 93 రూపాయల 83 పైసలుగా నమోదవుతోంది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 90 రూపాయల 78 పైసలు డీజిల్ 84 రూపాయల 52 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News