Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు స్థిరం

Petrol Rate: గత పది రోజులుగా స్థిరంగా, నిలకడగా పెట్రో ధరలు * సరికొత్త గరిష్టానికి చేరిన పెట్రో ఉత్పత్తుల ధరలు

Update: 2021-03-09 04:48 GMT

Representational Image

Petrol Rate: దేశంలో పెట్రో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పెట్రో ధరలు ఫిబ్రవరి 27వ తేదీ రోజున గణనీయంగా పెరగ్గా.. అప్పట్నుంచి గత పది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే గత రెండు నెలల వ్యవధిలో పెట్రోల్ రేటు లీటర్ కు 4 రూపాయల 87 పైసల మేర పెరగ్గా డీజిల్ లీటర్ కు 4 రూపాయల 99 పైసల మేర పెరగడం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ వద్దకు చేరగా. ఆర్దిక రాజధాని ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది.

దేశంలోని పలు మెట్రో నగరాల్లో పెట్రోల్ రేట్లు రికార్డు గరిష్ట ధరల వద్ద పరుగులు పెడ్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 79 పైసలు... ఏపీలోని మెట్రో నగరాల్లో 87 రూపాయల 24 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News