Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు స్థిరం
Petrol Rate: వరుసగా తొమ్మిదో రోజు స్థిరంగా, నిలకడగా పెట్రో ధరలు
Petrol Rate: దేశంలో పెట్రో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పెట్రో ధరలు ఫిబ్రవరి 27 వ తేదీ రోజున గణనీయంగా పెరగ్గా...అప్పట్నుంచి గత తొమ్మిది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి అయితే ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ వద్దకు చేరగా ఆర్దిక రాజధాని ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది. ఢిల్లీ, ముంబై సహీ దేశంలోని పలు మెట్రో నగరాల్లో పెట్రోల్ రేట్లు రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
ఈ నేపధ్యంలో ఆదాయ లక్ష్యాన్ని ప్రభావితం చేయకుండా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 8.5 రూపాయల మేర తగ్గించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి హైదరాబాద్ , విశాఖల్లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 79 పైసలు..డీజిల్ 88 రూపాయల 86 పైసలు వద్ద కొనసాగుతున్నాయి