Petrol Rate: వరుసగా ఐదో రోజు స్థిరంగా పెట్రో ధరలు
Petrol Rate: సరికొత్త గరిష్టానికి చేరిన పెట్రో ఉత్పత్తుల ధరలు
Petrol Rate: దేశంలో పెట్రో ధరలు వరుసగా ఐదో రోజు స్థిరంగా, నిలకడగా కొనసాగుతున్నాయి..పెట్రోలియం సరఫరా కంపెనీల రోజువారీ ధరల సమీక్ష ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ ఎగువన కొనసాగుతోంది ఆర్థిక రాజధాని ముంబైలో 97 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబైల్లో పెట్రోల్ రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపధ్యంలో ఆదాయ లక్ష్యాన్ని ప్రభావితం చేయకుండా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 8.5 రూపాయల మేర తగ్గించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర 101 రూపాయల 59 పైసలు వద్దకు చేరింది.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల 17 పైసలు, డీజిల్ 81 రూపాయల 47 పైసలు వద్దకు చేరాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 97 రూపాయల 57 పైసలు వద్దకు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 79 పైసలు..డీజిల్ 88 రూపాయల 86 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.