Petrol price : మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు

Petrol Price: రోజు రోజుకు పెరుగుతోన్న ఇంధన ధరలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి

Update: 2021-02-17 03:30 GMT

పెట్రోల్ ధరలు (ప్రతీకాత్మక చిత్రం)

దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు చుక్కలనంటుతున్నాయి. రోజు రోజుకు ఇంధన ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పెరుగుతోన్నఇంధన ధరలతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ప్రజలు జీవన ప్రయాణం కొనసాగించడం ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

- దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.29 ఉండగా, డీజిల్ ధర రూ. 79.70గా ఉంది.

- కొలకత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.546 ఉండగా, డీజిల్ ధర రూ.83.29గా ఉంది.

- వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.75 ఉండగా.. డీజిల్ ధర రూ. 86.72 గా ఉంది.

- చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.52 ఉండగా ... డీజిల్ ధర రూ.84.83గా ఉంది.

- బెంగుళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.28 ఉండగా... డీజిల్ ధర రూ. 84.49గా ఉంది.

- ఒడిషా  లో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.84 ఉండగా డీజిల్ ధర రూ.86.69గా ఉంది.

Tags:    

Similar News