దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరల మోత
* ఢిల్లీ, ముంబై నగరాల్లో పెట్రో ధరలు ఆల్ టైమ్ రికార్డ్ * పెట్రోల్ పై మరో 22-25 పైసలు పెరిగిన ధరలు * డీజిల్ పై మరో 25-27 పైసలు పెరిగిన రేట్లు
దేశంలో పెట్రోల్ ధరలు మరో మారు పెరిగి మోత మోగిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ప్రతిరోజు పెరుగుతూ వస్తున్న పెట్రో ధరలు బుధవారం రోజు మరింతగా పెరిగాయి. మెట్రో నగరాల్లో పెట్రోల్ పై 22 నుంచి 25 పైసలు, డీజిల్ పై 25 నుంచి 27 పైసలు చొప్పున పెరిగాయి. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆర్దిక రాజధాని ముంబైలోనూ పెట్రో ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిని తాకాయి. రాజధాని డిల్లీలో పెట్రోల్ లీటరు ధర 86 రూపాయల మార్క్ ను దాటి పరుగులు తీస్తోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 86 రూపాయల 30 పైసలు, డీజిల్ 76 రూపాయల 48 పైసలు వద్దకు చేరాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 89రూపాయల 77 పైసలు, డీజిల్ ధర లీటర్ 83 రూపాయల 46 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.