Petrol Rate: దేశంలో స్థిరంగా పెట్రో ధరలు
Petrol Rate: హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 94 రూపాయల 16 పైసలు * హైదరాబాద్ లో లీటర్ డీజిల్ ధర 88 రూపాయల 20 పైసలు
Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 90 రూపాయల 56 పైసలుగా ఉండగా డీజిల్ ధర 80 రూపాయల 87 పైసలు వద్దకి చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో 96 రూపాయల 98 పైసలుగా నమోదవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 94 రూపాయల16 పైసలు వద్ద, డీజిల్ ధర 88 రూపాయల 20 పైసలు వద్ద స్థిరంగా ఉన్నాయి.
ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 96 రూపాయల 65 పైసల వద్ద డీజిల్ ధర 90 రూపాయల 17 పైసలు వద్ద నిలకడగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.17 శాతం తగ్గుదలతో 64.56 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.42 శాతం క్షీణతతో 61.19 డాలర్లకు తగ్గింది.