దేశీయంగా మరోమారు పెరిగిన పెట్రో ధరలు ...
* వారం వ్యవధిలో వరుసగా ఆరోరోజు ఇంధన ధరల పెంపు.. * ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర వారంలో 74 పైసలు అప్.. * హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 84.17... * డీజిల్ ధర లీటర్‌కు 78 రూపాయల 41 పైసలు .. * విదేశీ మార్కెట్లో మూడు నెలల గరిష్టానికి క్రూడ్ ధరలు..
Petrol and Diesel Price Hike : దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోమారు పెరిగాయి. గత వారం రోజుల వ్యవధిలో వరుసగా ఆరోరోజు ఇంధన ధరలను చమురు సరఫరా కంపెనీలు సవరించాయి. రాజధాని ఢిల్లీ లో పెట్రోల్ ధర 74 పైసలు మేర పెరగ్గా. డీజిల్ ధర రూపాయి చొప్పున పెరిగింది.
ఢిల్లీ సహా కోల్‌కతా, ముంబై, చెన్నైవంటి నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో చమురు ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు పెరిగి 85 రూపాయల 17 పైసలు వద్దకు చేరగా. డీజిల్ ధర లీటర్‌కు 26 పైసలు పెరిగి 78 రూపాయల 41 పైసలు వద్ద కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్క్టెట్ లో ముడి చమురు ధరల పెంపు ప్రభావం దేశీయంగా పెట్రో ధరల భారానికి కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.