Petrol Price: మళ్లీ భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Price: వరుసగా 11వ రోజు చమురు కంపెనీలు ధరలను పెంచాయి
పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా 11వ రోజు చమురు కంపెనీలు ధరలను పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగడమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి.
గురువారంతో పోల్చితే శుక్రవారం పెట్రోల్‌పై 33 నుంచి 35 పైసలు, డీజిల్‌పై 31 పైసలు ధర పెరిగింది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌కు రూ.90.19, డీజిల్ రూ.80.60కి చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.96.62, హైదరాబాద్‌లో రూ.93.45కి చేరింది. విజయవాడలో రూ.96.16, కోల్‌కతాలో రూ.91.41 , చెన్నైలో రూ.92.25, బెంగళూరులో రూ.92.85కి చేరింది. డీజిల్ లీటర్ ధర ముంబైలో డీజిల్ ధర రూ.87.67, హైదరాబాద్‌లో రూ. 87.55, విజయవాడలో రూ.89.69, కోల్‌కతాలో రూ.84.19, చెన్నైలో రూ.85.63, బెంగళూరులో రూ. 85.06కి చేరింది.
గత 11 రోజులుగా చమురు కంపెనీలు వాహనదారులకు చుక్కలు చూపిస్తూ వస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు రోడ్లపైకి వాహనాలు తీయాలంటేనే బెంబేలెత్తుతున్నారు. గడిచిన 50 రోజుల్లో 23 సార్లు చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచాయి. ఈ ఏడాదిలో లీటర్‌పై రూ.7 వరకు పెంచాయి.