దేశంలోని మెట్రోనగరాల్లో ఇంధన ధరలు యధాతథం

Update: 2020-12-11 07:04 GMT

దేశంలోని మెట్రోనగరాల్లో ఇంధన ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు భారత చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను యధాతధంగా వుంచాయి. గతవారంలో నిరాటంకంగా పరుగులు తీసిన పెట్రో ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతుండటంతో వాహనదారులకు ఉపశమనం లభించినట్లయింది.

రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 83 రూపాయల 71 పైసలుగా వుండగా డీజిల్‌ ధర 73.87 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అదేవిధంగా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 87 రూపాయల 06 పైసలు డీజిల్ ధర లీటర్‌ 80.60 పైసల వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ధరల పరుగులు కొనసాగుతున్నాయి. డబ్ల్యుటిఐ ముడి చమురు ధర 0.44 శాతం పెరిగి 45.72 డాలర్లకు చేరుకుంది. అదేవిధంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 0.41 శాతం మేర పెరిగి 49.06 డాలర్లగా నమోదయింది.

Tags:    

Similar News