దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు వరుసగా మూడో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోలియం సరఫరా కంపెనీల రోజువారీ ధరల సమీక్ష ఫలితంగా ఈనెల 23న పెట్రోల్ ,డీజిల్ ధరలు 35 పైసలు చొప్పున పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ వద్ద కొనసాగుతుండగా ఆర్దిక రాజధాని ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది. మరోవైపు రాజస్థాన్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర సెంచరీ దాటి 101 రూపాయల 59 పైసలు వద్దకు చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయల 93 పైసలు, డీజిల్ 81 రూపాయల 32 పైసలు వద్దకు చేరాయి. ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 97 రూపాయల 34 పైసలు వద్దకు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 54 పైసలు, డీజిల్ 88 రూపాయల 69 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.