దేశంలో వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రో ధరలు

తాజాగా రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర 15 పైసలు మేర పెరగ్గా .. డీజిల్‌ ధర సైతం లీటర్‌కు 20 పైసలు ఎగసింది..దేశంలో ఇంధన ధరలు 48 రోజులుగా యధాతధంగా వుండగా, శుక్రవారం రోజు చమురు సరఫరా కంపెనీలు రేట్లను సవరించాయి.

Update: 2020-11-21 10:03 GMT

దేశంలో వరుసగా రెండో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి ..దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో సగటున 15 నుంచి 25 పైసల మధ్య ధరలు పెరిగాయి. తాజాగా రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర 15 పైసలు మేర పెరగ్గా .. డీజిల్‌ ధర సైతం లీటర్‌కు 20 పైసలు ఎగసింది..దేశంలో ఇంధన ధరలు 48 రోజులుగా యధాతధంగా వుండగా, శుక్రవారం రోజు చమురు సరఫరా కంపెనీలు రేట్లను సవరించాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 17 పైసలు పెరిగి 84 రూపాయల 64 పైసలు వద్దకు చేరగా.. డీజిల్ ధర లీటర్‌కు 23 పైసలు పెరిగి 77 రూపాయల 35 పైసలు వద్ద కొనసాగుతున్నాయి. ఇక గ్లోబల్ మార్కెట్ విషయానికి వస్తే.. వారాంతాన బ్రెంట్‌ చమురు బ్యారల్‌ దాదాపు 2 శాతం జంప్‌చేసి 45 డాలర్ల చేరువలో ముగిసింది. ఇక న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ సైతం ఒక్క శాతం మేర ఎగసి 42.15 డాలర్ల వద్ద స్థిరపడింది.

Tags:    

Similar News