పెన్షనర్లకి అలర్ట్‌.. ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం, నేషనల్‌ పెన్షన్ స్కీంకి తేడా తెలుసుకోండి..!

పెన్షనర్లకి అలర్ట్‌.. ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం, నేషనల్‌ పెన్షన్ స్కీంకి తేడా తెలుసుకోండి..!

Update: 2022-09-23 12:56 GMT

పెన్షనర్లకి అలర్ట్‌.. ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం, నేషనల్‌ పెన్షన్ స్కీంకి తేడా తెలుసుకోండి..!

OPS vs NPS: చాలా రాష్ట్రాల్లో ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ని (OPS) అమలు చేయాలని ఉద్యోగులు తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ పెన్షన్ విధానం ముఖ్యంగా బీజీపీ వ్యతిరేక రాష్ట్రాల్లో అమలులో ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్రాలో ఇది ప్రధాన డిమాండ్‌గా ఉంది. అయితే ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ని మూసేసి ప్రభుత్వం నేషనల్‌ పెన్షన్ స్కీంని (NPS) ప్రారంభించింది. ఎన్‌పిఎస్ అనేది కొత్త పెన్షన్ స్కీమ్. దీనిని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ రెండు కూడా పదవీ విరమణ పథకాలే.

OPS, NPS మధ్య తేడా

NPS కింద ఉద్యోగులు డబ్బును డిపాజిట్ చేస్తూనే ఉంటారు. ఈ మొత్తం డబ్బు మార్కెట్ లింక్డ్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడుతారు. దీనికి విరుద్ధంగా OPSలో ఉద్యోగికి చివరి జీతం ఆధారంగా పెన్షన్ అందిస్తుంది. OPS కింద ఉద్యోగి చివరి జీతంలో 50 శాతం పెన్షన్‌గా చెల్లిస్తుంది. NPSలో సెక్షన్ 80C కింద వార్షిక పెట్టుబడిపై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇది కాకుండా సెక్షన్ 80CCD(1B) కింద రూ.50,000 వరకు అదనపు మినహాయింపు పొందవచ్చు. అయితే OPSలో ఎలాంటి పన్ను మినహాయింపు నిబంధన లేదు.

NPSలో ఉద్యోగి రిటైర్మెంట్‌ తర్వాత 60% కార్పస్‌ను ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. ఇది పన్ను రహితంగా ఉంటుంది. మిగిలిన 40 శాతం జీవిత బీమా కంపెనీల యాన్యుటీలో జమ చేస్తారు. ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బుపై పన్ను విధిస్తారు. అయితే OPS నుంచి సంపాదించిన ఏ ఆదాయంపై పన్ను విధించరు.18 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల ప్రతి పౌరుడు ఎన్‌పిఎస్‌ని పొందవచ్చు. OPS కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.

రెండిటిలో ఏది బెస్ట్‌

OPSలో ఉద్యోగి చివరిగా అందుకున్న జీతంలో 50% పెన్షన్ రూపంలో అందుతుంది. కానీ NPS పెన్షన్ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. NPS మార్కెట్ లింక్ అయినందున హెచ్చుతగ్గులు సాధారణంగా ఉంటాయి. NPS రాబడులకు హామీ ఇవ్వదు. NPS అతిపెద్ద లక్షణం ఏంటంటే మార్కెట్ లింక్డ్ సెక్యూరిటీలలో డబ్బు పెట్టుబడి పెట్టడం. దీని కారణంగా NPS డబ్బు పెరుగుతుంది. అయితే ఇందులో ప్రమాదం కూడా పొంచి ఉంది. అందువల్ల భవిష్యత్తులో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనుకునే వారికి NPS ఉత్తమం.

Tags:    

Similar News