Government Scheme: అలర్ట్.. 10 రోజుల్లో ఈ పని పూర్తి చేయండి.. లేకుంటే భారీ నష్టం..!
Pan Card Update: అనేక ప్రభుత్వ పనులను సకాలంలో పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఈ పనులు సకాలంలో చేపట్టకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడం కూడా ఈ లిస్టులో చేరింది.
Pan Card: అనేక ప్రభుత్వ పనులను సకాలంలో పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఈ పనులు సకాలంలో చేపట్టకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడం కూడా ఈ లిస్టులో చేరింది. ప్రతి భారతీయ పౌరుడికి పాన్ కార్డు జారీ చేస్తారు. అదే సమయంలో ఈ పాన్ కార్డును వారి ఆధార్ కార్డుతో లింక్ చేయడం కూడా చాలా ముఖ్యం. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని ప్రభుత్వం చాలాసార్లు కోరింది.
భారతీయ ఆదాయపు పన్ను శాఖ ద్వారా ప్రజలు తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి. ఎవరైనా ఇంకా పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయకపోతే, ఆ వ్యక్తి 30 జూన్ 2023లోపు పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయవచ్చు. ఇందుకోసం ఆ వ్యక్తి రూ.1000 ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు, ఒక వ్యక్తి 30 జూన్ 2023 నాటికి పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయలేకపోతే, అతని పాన్ కార్డ్ ఇన్‌యాక్టివ్‌గా మారుతుంది. ఒక్కసారి పాన్ కార్డ్ ఇన్‌యాక్టివ్ అయితే, ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయనట్లయితే..
ముఖ్యంగా పన్ను చెల్లింపుదారుల పాన్ కార్డ్‌లు ఇన్‌యాక్టివ్‌గా మారితే.. టీడీఎస్, టీసీఎస్ రెండింటిలోనూ పన్ను అధిక రేటుతో విధిస్తారు.
- పెండింగ్‌లో ఉన్న వాపసు, వడ్డీ జారీ చేయరు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడంలో సమస్యలు ఉంటాయి.
- ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.