PPF: పిల్లల పేరుపై పీపీఎఫ్ ఖాతా తెరవండి.. రూ. 32 లక్షల ఫండ్ సృష్టించండి..!
PPF: పిల్లల పేరుపై పీపీఎఫ్ ఖాతా తెరవండి.. రూ. 32 లక్షల ఫండ్ సృష్టించండి..!
PPF: పిల్లల జీవితం ఆనందంగా ఉండాలని, చదువు, పెళ్లి టెన్షన్ ఉండకూడదని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే అన్ని సవ్యంగా జరగాలంటే చిన్న వయసులోనే పిల్లల పేరుపై పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనివల్ల తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు. అలాంటి పథకాలలో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF).దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మీరు సరైన సమయంలో మీ పిల్లల పేరుపై పీపీఎఫ్ ఖాతాను తెరిచి కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం ప్రారంభించాలి. మీరు ప్రతి నెలా డబ్బు డిపాజిట్ చేయడం అలవాటు చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్ సురక్షితంగా ఉంటుంది. అయితే పిల్లల పేరుపై పీపీఎఫ్ ఖాతా ఎలా తెరవాలి.. దీనికి ఏ డాక్యుమెంట్లు అవసరమో తెలుసుకుందాం. నిజానికి పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే వయసుతో పనిలేదు. ఇందుకోసం మీరు ఏదైనా అధీకృత బ్యాంకు శాఖకు వెళ్లి అక్కడ ఫారం 1 నింపండి. ఇంటికి సమీపంలో ఏదైనా బ్రాంచ్ ఉంటే అక్కడ పీపీఎఫ్ ఖాతాను తెరవడం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో దీన్ని నిర్వహించడం సులభం అవుతుంది.
పిల్లల పేరు మీద ఉన్న పీపీఎఫ్ ఖాతా నుంచి రూ.32 లక్షలు ఎలా పొందాలో తెలుసుకుందాం. మీ పిల్లల వయస్సు 3 సంవత్సరాలప్పుడు మీరు పీపీఎఫ్ ఖాతా తెరిచి పెట్టుబడి పెట్టడం ప్రారంభించారని అనుకుందాం. పిల్లలకి 18 ఏళ్లు వచ్చేసరికి పీపీఎఫ్ ఖాతా మెచ్యూర్ అవుతుంది. తరువాత మీకు కావాలంటే మీరు ఈ వ్యవధిని పెంచుకోవచ్చు. ఈ ఖాతాలో ప్రతి నెలా రూ. 10,000 జమ చేయడం ప్రారంభించండి. 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. ఇప్పుడు రాబడిని 7.10 శాతం చొప్పున జోడిస్తే పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీపై పిల్లలకు రూ. 3,216,241 లభిస్తుంది. బిడ్డకు 18 ఏళ్లు వచ్చినప్పుడు ఈ మొత్తం అందుబాటులో ఉంటుంది.