Samridhi Yojana: సుకన్య సమృద్ధి యోజన లబ్ధిదారులకు గమనిక...
Samridhi Yojana: సుకన్య సమృద్ధి యోజన లబ్ధిదారులకు గమనిక.. కొత్త సంవత్సరం నుంచి ఈ మార్పులు..
Samridhi Yojana: ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకి సుకన్య సమృద్ధి యోజన పథకం ఒక వరంలాంటిది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి అధిక వడ్డీ చెల్లిస్తుంది. 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికల పేరుతో ఈ ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది. తాజాగా కొత్త సంవత్సరం నుంచి వడ్డీ రేట్లలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లన పెంచుతుందని లబ్ధిదారులు ఆశిస్తున్నారు.
ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 7.6 శాతం. ఈ నిర్ణయం ప్రభుత్వ సెక్యూరిటీలపై అందుబాటులో ఉన్న వడ్డీ రేటు ఆధారంగా తీసుకుంటారు. ఈ పథకాన్ని 2014లో ప్రధాని మోదీ ప్రారంభించారు. 10 సంవత్సరాల వయస్సున్న ఆడపిల్లల పేరు మీద ఈ ఖాతా తెరవవచ్చు. 21 సంవత్సరాల వయస్సులో ఖాతా మెచ్యూర్ ఉంటుంది. ఈ పథకంలో కనీసం రూ.250 డిపాజిట్ చేయవచ్చు. ఆర్థిక సంవత్సరంలో గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలుగా నిర్ణయించారు.
సుకన్య సమృద్ధి యోజన కింద బాలికల పేరుతో పోస్టాఫీసు లేదా బ్యాంకులో ఒక ఖాతా మాత్రమే తీసుకోవచ్చు. కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం ఈ ఖాతాను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. అయితే కవలలు లేదా ఒకేసారి ముగ్గురు పిల్లలు పుట్టినప్పుడు రెండు కంటే ఎక్కువ ఖాతాలు ఓపెన్ చేయడానికి అనుమతి ఉంటుంది. ఈ పథకంలో ఖాతా తెరిచిన తేదీ నుంచి గరిష్టంగా 15 సంవత్సరాలు పూర్తయ్యే వరకు డబ్బులు డిపాజిట్ చేయవచ్చు.
ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం రూ. 250 జమ చేయకపోతే ఆ ఖాతా డిఫాల్ట్‌గా పరిగణిస్తారు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 15 సంవత్సరాలు పూర్తికాకముందే డిఫాల్ట్ ఖాతాను పునరుద్ధరించవచ్చు. దీని కోసం ప్రతి డిఫాల్ట్ సంవత్సరానికి రూ. 50 డిఫాల్ట్‌తో కనీసం రూ. 250 చెల్లించాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద డిపాజిట్ చేసిన మొత్తంపై మినహాయింపు ఉంటుంది. ఈ పథకంలో వచ్చే వడ్డీకి కూడా ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు ఉంటుంది.