SBI Axis Bank: ఎస్బీఐ,యాక్సిస్ ఖాతాదారులకి పెద్ద ఎదురుదెబ్బ..!
SBI Axis Bank: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
SBI Axis Bank: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. మీరు SBI లేదా యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అయితే మీకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. వాస్తవానికి ఈ రెండు బ్యాంకులు తమ రుణాలపై వడ్డీ రేట్లను పెంచాయి. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI రుణాన్ని చాలా ఖరీదుగా చేసింది. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్ కూడా రుణంపై వడ్డీ రేట్లను పెంచింది. ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను 0.05 శాతం పెంచింది. ఈ మేరకు బ్యాంకు సమాచారం ఇచ్చింది. అంతకుముందు SBI అంతర్గత బెంచ్‌మార్క్‌తో అనుసంధానించిన వడ్డీ రేట్లను 0.10 శాతం పెంచింది. కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వచ్చాయి.
యాక్సిస్ బ్యాంక్ రుణాలని ఖరీదైనదిగా చేసింది. బ్యాంకు ఎంసీఎల్‌ఆర్‌ను 0.05 శాతం పెంచింది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి వచ్చాయి. MCLR అనేది బ్యాంకు అంతర్గత ఖర్చులు. వీటి ఆధారంగా వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు. RBI రెపో రేటును మార్చినప్పుడు మాత్రమే ఇందులో ఏదైనా మార్పు జరుగుతుంది. ఏప్రిల్ 15, 2022 నుంచి అమలులోకి వచ్చేలా SBI తన అన్ని టర్మ్ లోన్‌లకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR)ని 10 బేసిస్ పాయింట్లు (0.10 శాతం) పెంచింది.
ఇప్పుడు దీని తర్వాత SBI అన్ని రకాల రుణాలు, గృహ, ఆటో, ఇతర రుణాలు ఖరీదైనవిగా మారాయి. మీరు 20 సంవత్సరాల పాటు SBI నుంచి రూ. 20 లక్షల రుణం తీసుకుని దానిపై 7 శాతం వడ్డీ చెల్లిస్తున్నట్లయితే మీ రూ.15,506 EMI చెల్లించాలి. కానీ ఇప్పుడు మీకు 7.10 శాతం వడ్డీ రేటు ఉంటే మీ EMI రూ.15,626కి పెరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం రూ.1,440 భారం పడుతుంది.