EPFO: పీఎఫ్‌ ఖాతాలో అవసరాన్ని బట్టి నామినీని మార్చుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..!

EPFO: ఈపీఎఫ్‌ ఖాతాలో నామినీ పేరుని మార్చడానికి దిగులుపడాల్సిన అవసరం లేదు.

Update: 2023-02-23 05:15 GMT

EPFO: పీఎఫ్‌ ఖాతాలో అవసరాన్ని బట్టి నామినీని మార్చుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..!

EPFO: ఈపీఎఫ్‌ ఖాతాలో నామినీ పేరుని మార్చడానికి దిగులుపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎన్నిసార్లయినా సులువుగా నామినీని మార్చుకోవచ్చు. ఎటువంటి ఖర్చు కూడా ఉండదు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగుల జీతంలో కొంత భాగాన్ని పీఎఫ్‌ ఖాతాలో జమ చేయడం ద్వారా సామాజిక భద్రతను అందిస్తుంది. రిటైర్మెంట్‌ లేదా అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫండ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే నామినీ పేరుని కచ్చితంగా యాడ్‌ చేయాలి.

EPF ఖాతాదారు రిటైర్మెంట్‌కి ముందు మరణిస్తే అతని కుటుంబం EDLI పథకం కింద PF ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. రూ.7 లక్షల వరకు బీమా పొందవచ్చు. అందుకే EPFO సబ్‌స్క్రైబర్‌లు తమ ఖాతాలో ఇ-నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సలహా ఇస్తుంది. అప్పుడే వారి నామినీలు ఈ ప్రయోజనాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొందుతారు. EPFO ఖాతాదారులు తమ నామినీ పేరును ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు మార్చుకోవచ్చు. తద్వారా వారి ఖాతాను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు.

నామినీని ఇలా మార్చుకోవచ్చు

1. ఈ-నమోదు ప్రక్రియను పూర్తి చేయడానికి ఖాతాదారులు EPFO వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

2. మీ UAN నంబర్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ కావాలి. ప్రాసెస్‌ను ప్రారంభించడానికి మేనేజ్ విభాగానికి నావిగేట్ చేయాలి.

3. వెబ్‌సైట్ వినియోగదారులను వారి నామినీ అన్ని వివరాలను అందించమని అడుగుతుంది. వారు ఓకె బటన్‌పై క్లిక్ చేసి దీన్ని చేయవచ్చు.

4. వివరాలను ఎంటర్‌ చేసిన తర్వాత ఖాతాదారుడు కుటుంబ వివరాల కోసం ఎంపికను క్లిక్ చేసి కొత్త నామినీ పేరుని యాడ్‌ చేయవచ్చు. తర్వాత నామినేషన్‌ను సేవ్ చేయాలి.

5. ప్రక్రియను పూర్తి చేయడానికి వారు ఈ-సైన్ చేసి ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్‌ చేయాలి.

Tags:    

Similar News