New Wage Code: ఉద్యోగులకి అలర్ట్‌.. అక్టోబర్‌ నుంచి కొత్త లేబర్‌ కోడ్‌ అమలు..!

New Wage Code: కార్పొరేట్ రంగంలోని ఉద్యోగులకు ఇచ్చే జీతంలో భత్యం వాటా మొత్తం జీతంలో 50 శాతానికి మించరాదు.

Update: 2022-08-25 13:41 GMT

New Wage Code: కార్పొరేట్ రంగంలోని ఉద్యోగులకు ఇచ్చే జీతంలో భత్యం వాటా మొత్తం జీతంలో 50 శాతానికి మించరాదు. ఈ అంశంపై రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ప్రభుత్వం, పరిశ్రమ ప్రజల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఉద్యోగుల జీతంలో భత్యం వాటా 50 శాతానికి మించకూడదని నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించి ఒక విషయం మిగిలే ఉంది. ఆగస్టు 24-25 తేదీల్లో కార్మిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో సమావేశం కానుంది. కొత్త లేబర్‌ కోడ్‌ను అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అమలు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని భావిస్తున్నారు.

దీని ప్రకారం.. మొత్తం వేతనంలో ఉద్యోగి ప్రాథమిక వేతనం 50 శాతం ఉంటుందని స్పష్టమైంది. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల వేతన స్వరూపం పూర్తిగా మారిపోతుంది. బేసిక్ జీతం మొత్తం జీతంలో 50 శాతం అయిన తర్వాత ఉద్యోగుల జీతం నుంచి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ కోసం ఎక్కువ డబ్బు కట్‌ అవుతుంది. కంపెనీలు తమ తరపున ఉద్యోగుల పీఎఫ్‌ అంశం కోసం మరింత విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీంతో పాటు ఉద్యోగుల టేక్‌హోమ్ జీతంలో తగ్గింపు ఉంటుంది.

అయితే వీలైనంత త్వరగా కొత్త లేబర్ కోడ్‌ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అన్ని ఓకే అయితే అక్టోబరు నుంచి కొత్త లేబర్ కోడ్ అమలులోకి రావచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ తెలిపారు. కొత్త లేబర్ కోడ్ ద్వారా దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. దీంతో పాటు ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు లేబర్ కోడ్ నియమాలను రూపొందించాయి. పార్లమెంటులో చట్టం ఆమోదించబడింది. అయితే అన్ని రాష్ట్రాలు కూడా దానిని ఆమోదించాలి. తర్వాత దేశంలో కొత్త లేబర్ కోడ్‌ను అమలు అవుతుంది.

Tags:    

Similar News