సెప్టెంబర్‌ 30 తర్వాత వారు ఈ ప్రభుత్వ పథకంలో చేరలేరు..!

Atal Pension Yojana: మీకు అటల్ పెన్షన్ యోజనలో ఖాతా ఉంటే లేదా ఈ ప్రభుత్వ పథకంలో ఖాతాను తెరవాలని ప్లాన్ చేస్తుంటే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి.

Update: 2022-08-23 13:30 GMT

సెప్టెంబర్‌ 30 తర్వాత వారు ఈ ప్రభుత్వ పథకంలో చేరలేరు..!

Atal Pension Yojana: మీకు అటల్ పెన్షన్ యోజనలో ఖాతా ఉంటే లేదా ఈ ప్రభుత్వ పథకంలో ఖాతాను తెరవాలని ప్లాన్ చేస్తుంటే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకార్థం అమలవుతున్న ఈ పథకం కింద 60 ఏళ్ల తర్వాత పెన్షన్‌కు హామీ ఉంటుంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం దీనిని నిర్వహిస్తోంది.

జూన్ 2015లో ప్రారంభించిన ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం పెద్ద మార్పు చేసింది. ఆదాయ రిటర్న్‌లు దాఖలు చేసే వారు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఈ స్కీమ్‌కు సభ్యత్వం పొందగలరు. తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసిన వారికి ఈ పథకం ప్రయోజనం ఉండదు. అటల్ పెన్షన్ యోజనను 1 జూన్ 2015న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30 తర్వాత వచ్చిన దరఖాస్తులను రద్దు చేస్తారు.

ఈ పథకం కింద అర్హులైన వృద్ధులకు ప్రతినెలా రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ అందజేస్తారు. మార్చి 2022లో ఈ పథకంలో నమోదు చేసుకున్న వారి సంఖ్య 4 కోట్లు దాటింది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అక్టోబర్ 1 నుంచి ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయరాదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. 30వ తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరిస్తారు. మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేస్తే ఏదైనా సందర్భంలో సెప్టెంబర్ 30 లోపు సభ్యత్వాన్ని పొంది ఖాతా తెరవాలి.

ఈ పథకం నిబంధనల ప్రకారం 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు ఇందులో నమోదు చేసుకోవచ్చు. దీని కోసం దరఖాస్తుదారు బ్యాంకు లేదా పోస్టాఫీసులో పొదుపు ఖాతాను తెరవాలి. ఈ ఖాతా నుంచి ప్రతి నెలా మీ రూ.42 నుంచి రూ.1454 వరకు కట్‌ అవుతుంది. 60 ఏళ్ల తర్వాత ప్రతినెలా రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుంది.

Tags:    

Similar News