అక్టోబర్ నెల.. తప్పక తెల్సుకోవాల్సిన కొన్ని కొత్త నిబంధనలు..టీవీల ధరలు పెరగనున్నాయి.!

new rules from October 1st; ప్రభుత్వం ఈ నెలలో కొన్ని కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి టీవీల పై టాక్స్ ల వరకూ ఈరోజు నుంచి రాబోతున్న మార్పులు సంక్షిప్తంగా..

Update: 2020-10-01 03:22 GMT

క్యాలెండర్ లో కొత్త నెల వచ్చేసింది. అలాగే..ప్రభుత్వ పరంగా కొన్ని కొత్త నిబంధనలు.. మరి కొన్ని నిబంధనలకు మార్పులూ..చేర్పులూ..వచ్చి చేరుతున్నాయి. వాహనాల పత్రాల దగ్గర నుంచి పన్నుల వరకూ పలు అంశాల్లో కొత్త నిబంధనలు.. పద్దతులు ఈ అక్టోబర్ 1 నుంచి అమలు కానున్నాయి. ఇవి కొన్ని నేరుగా మన పై ప్రభావం చూపించేవి అయితే, మరికొన్ని పరోక్షంగా ప్రభావం చూపించేవి. వీటిలో కొన్ని మన పర్సులపై భారం మోపేవి.. ఇంకొన్ని మనకు వెసులుబాటు ఇచ్చేవి.. అవి ఏమిటో ఒకసారి చూద్దాం..

ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు..

ఉజ్వల స్కీం కింద కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో ఉచితంగా గ్యాస్ సిలెండర్లను సరఫరా చేసింది. ఇకపై ఉచిత సరఫరా ఉండదు. గ్యాస్ కు ఇక పైసలు చెల్లించాల్సి ఉంటుంది.

స్వీట్స్ కొనాలంటే..

ఇది ఒక తీయని కబురు. ఇంతకు ముందు స్వీట్ స్టాల్ లో స్వీట్లు కొంటె అవి ఎప్పుడు చేశారో.. ఎలా ఉంటాయో అనే బెంగ ఉండేది. ఇప్పుడు అది అక్కరలేదు. ఎందుకంటే, స్వీట్ షాపుల్లో చేసే స్వీట్ ల పై కచ్చితంగా వాటి తయారీ తేదీ.. ఎప్పటిలోగా వాటిని తినవచ్చు వంటి వివరాలు.. ముద్రించాల్సి ఉంటుంది. సో..నిలువ ఉంచిన స్వీట్లు కొనుక్కుని ఇబ్బంది పడే బాధ తప్పుతుంది.

వాహనాలకు సంబంధించి..

ఇక నుంచి వాహనదారులు లైసెన్స్, రిజిష్ట్రేషన్ డాక్యుమెంట్స్, పర్మిట్ లు వంటి డాక్యుమెంట్లను మనతో పాటు మోసుకుంటూ వెళ్ళాల్సిన పనిలేదు. కేంద్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యెక వెబ్ పోర్టల్ తీసుకు వచ్చింది. దానిలో ఈ డాక్యుమెంట్స్ ఉంచి, అవసరమైనపుడు వాటిని అధికారులకు చూపిస్తే సరిపోతుంది. అదే విధంగా మొబైల్ ఫోన్ ను డ్రైవింగ్ లో ఉపయోగించవచ్చు. కానీ, నావిగేషన్ కోసం మాత్రమె. ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళడం మాత్రం నేరమే. భారీ జరిమానా తప్పదు.

టీవీలు మరింత ప్రియం..

అక్టోబర్ 1 నుంచి టీవీల ధరలు పెరగనున్నాయి. కారణం..కేంద్ర ప్రభుత్వం కస్టమ్ డ్యూటీ మినహాయింపును తొలగించింది. ఓపెన్ సేల్స్ పై దీనివలన 5 శాతం టాక్స్ పడుతుంది. సహజంగానే ఆ అభారం వినియోగదారుల పైనే పడుతుంది.

టాక్స్.. ఇన్సూరెన్స్ రూల్స్..

విదేశాలకు పంపించే డబ్బు పై ఇక నుంచి టాక్స్ కట్టాల్సి వస్తుంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో ఏడు లక్షల రూపాయల వరకూ టాక్స్ ఉండదు. అది దాటితే 5 శాతం టీసీఎస్ కట్టాల్సి ఉంటుంది. అయితే, విద్యార్ధులకు పన్నులో రాయితీ లభిస్తుంది. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ లకు సంబంధించి ఐఆర్‌డీఏఐ ఈ రోజు నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువస్తోంది. దాని ప్రకారం ఇప్పటికే తీసుకున్న పాలసీలలో.. ఇకపై తీసుకోబోయే పాలసీలలో..ఇప్పటికే ఉన్న పాలసీలలో చాలా వరకూ వ్యాదుల్ని కవర్ చేసేలా మార్పులు చేసింది ఐఆర్‌డీఏఐ. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నవారు అవి గమనించాల్సి ఉంది.

బ్యాంకు కార్డులు..

డెబిట్, క్రెడిట్ కార్డులపై అక్టోబర్ 1 వ తేదీ నుంచి కొన్ని రకాల సేవలు అందుబాటు లో ఉండవు. ఇంటర్నేషనల్ లావాదేవీలు ఇకపై కుదరకపోవచ్చు. 

Tags:    

Similar News