Maruti Baleno: ఫిబ్రవరి 10న విడుదలకానున్న కొత్త మారుతి బాలెనో..? ఫీచర్లు, ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు...

Maruti Baleno: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఫిబ్రవరి 10న అప్‌డేట్‌ చేసిన సరికొత్త బాలెనో కారుని విడుదల చేయనుంది.

Update: 2022-02-02 09:27 GMT

Maruti Baleno: ఫిబ్రవరి 10న విడుదలకానున్న కొత్త మారుతి బాలెనో..? ఫీచర్లు, ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు...

Maruti Baleno: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఫిబ్రవరి 10న అప్‌డేట్‌ చేసిన సరికొత్త బాలెనో కారుని విడుదల చేయనుంది. ఇప్పటికే ఫిబ్రవరి 1 నుంచి బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ కొత్త సెగ్మెంట్‌ లోపల, బయట చాలా మార్పులతో వస్తుంది. సరికొత్త ఫీచర్ల జాబితాను కలిగి ఉంది. అయితే దీని ధర ప్రస్తుత మోడల్‌తో సమానంగానే ఉంటుంది. దాదాపు రూ.6.4 లక్షల నుంచి రూ.10.3 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు.

మారుతి సుజుకి బాలెనో ప్రీమియం పూర్తి కొత్త ఫీచర్లతో వస్తుంది. కొత్త టెక్నాలజీ, సామర్థ్యం కూడా అప్‌డేట్ చేశారు. బాలెనో 2015 చివరి నుంచి భారతీయ మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉంది. వినియోగదారుల నుంచి మంచి స్పందనను అందుకుంది. ఇప్పటివరకు దాదాపు ఒక మిలియన్ యూనిట్లకు పైగా విక్రయాలు జరిగాయి. 2022 మారుతి సుజుకి బాలెనో ప్రీమియం 2020లో విడుదల చేసిన థర్డ్‌ జనరేషన్ హ్యుందాయ్ i20, టాటా ఆల్ట్రోజ్‌లతో పోటీపడనుంది.

ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్ సహజంగా-ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఉపయోగించడం కొనసాగుతుంది. అయితే మరింత సరసమైన AMT యూనిట్ కోసం CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ నిలిపివేశారు. కొత్త హెడ్‌ల్యాంప్‌లు, గ్రిల్ సెక్షన్, బంపర్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌తో ట్వీక్ చేయబడిన బానెట్ స్ట్రక్చర్‌తో ఫేస్‌లిఫ్ట్ పూర్తిగా రీడిజైన్ చేశారు. వెనుక భాగంలో కొత్తగా రూపొందించబడిన LED టెయిల్ ల్యాంప్‌లు అప్‌డేట్‌ చేసిన టెయిల్‌గేట్, బంపర్‌లు ఉన్నాయి. లోపలి భాగంలో అప్‌డేట్‌ బాలెనో కొత్త డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌తో అప్‌డేట్‌ చేసిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మౌంటెడ్ కంట్రోల్‌, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌తో వస్తుంది. ఇది మరింత ప్రీమియం వైబ్‌ని అందించడానికి కొత్త సర్ఫేస్ ట్రిమ్‌లు, యాక్సెంట్‌లను కూడా పొందుతుంది.

Tags:    

Similar News