అత్యవసర డబ్బుకోసం.. ఇలా సులువుగా రుణం పొందండి..!
Bank Overdraft: మనకు డబ్బు అత్యవసరమైనప్పుడు స్నేహితులు లేదా బంధువులను అప్పడుగుతాము.
Bank Overdraft: మనకు డబ్బు అత్యవసరమైనప్పుడు స్నేహితులు లేదా బంధువులను అప్పడుగుతాము. కానీ ఇది కాకుండా మరొక పద్దతి కూడా ఉంది. మీకు సులువుగా డబ్బులు వస్తాయి. బ్యాంకు ద్వారా మంజూరవుతాయి. అవును నిజమే మీ అకౌంట్‌లో డబ్బులు లేకున్నా మీరు ఓవర్ డ్రాప్ట్ ద్వారా రుణం తీసుకోవచ్చు. దీని కోసం ముందుగా మీరు కొన్ని విషయాలను పరిశీలించాలి. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం.
చాలా మంది ఖాతాలో ఉన్న డబ్బులు మాత్రమే విత్ డ్రా చేయవచ్చని భావిస్తారు. కానీ మీరు అందులో డబ్బులు లేకున్నా విత్ డ్రా చేయవచ్చు. దీని కోసం అనేక బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తమ కస్టమర్లకు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ సదుపాయాన్ని బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తమ కస్టమర్లలో కొంతమందికి అందిస్తున్నాయి.
మరికొందరు దీనికోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా లేదా ఆన్‌లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ప్రాసెసింగ్ ఫీజులని తెలుసుకోవాలి. కొన్నిసార్లు బ్యాంకులు సాలరీ అకౌంట్ ద్వారా ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. మీ జీతంపై 2-3 రెట్లు ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకోవచ్చు.