Old Pension: పాత పెన్షన్‌ స్కీమ్‌పై దేశవ్యాప్త చర్చ.. ప్రయోజనాలు ఏంటంటే..?

Old Pension Benefits: పాత పెన్షన్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

Update: 2023-01-23 16:00 GMT

Old Pension: పాత పెన్షన్‌ స్కీమ్‌పై దేశవ్యాప్త చర్చ.. ప్రయోజనాలు ఏంటంటే..?

Old Pension Benefits: పాత పెన్షన్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇంతలో చాలా రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలులోకి తెచ్చాయి. అయితే చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ కొత్త పెన్షన్ విధానం కొనసాగుతోంది. ఇప్పుడు పాత పెన్షన్ స్కీమ్ (OPS)పై చాలా రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన స్థాయిలో పెన్షన్‌ పథకాలను అమలు చేస్తోంది.

కొన్ని రాష్ట్రాల్లో కొత్త పెన్షన్‌ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ప్రారంభించారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు పాత పెన్షన్ స్కీమ్ ప్రయోజనం లభిస్తుంది. ఈ వార్త వినగానే ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆర్థిక శాఖ నిర్ణయాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 1.36 లక్షల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ఆర్థిక శాఖ నిబంధనలు, షరతులు జారీ చేసింది.

ఎన్నికల హామీ మేరకు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం మహిళల కోసం ఈ పథకాన్ని రూపొందిస్తోందని దీంతో పాటు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500 ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఉపాధిని పెంచేందుకు నెల రోజుల్లో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇంతకుముందు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, రాజస్థాన్ ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశాయి. ఇప్పుడు హిమాచల్ ప్రభుత్వం కూడా ఈ లిస్టులో చేరింది.

పాత పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలు

పాత పెన్షన్ పథకం అతిపెద్ద ప్రయోజనం చివరిగా డ్రా చేసిన జీతం ఆధారంగా ఉంటుంది. దాదాపు సగం జీతం పెన్షన్‌గా వస్తుంది. ఇది కాకుండా ద్రవ్యోల్బణం రేటు పెరగడంతో DA కూడా పెరుగుతుంది. ప్రభుత్వం కొత్త పే కమిషన్‌ను అమలు చేసినప్పటికీ పెన్షన్‌ పెరుగుతూ ఉంటుంది.

Tags:    

Similar News