ఇప్పుడు పోస్టాఫీసు నుంచి పెన్షన్ ఖాతా.. ఇంటి దగ్గరి నుంచే చెల్లింపులు..!

National Pension Scheme: మీరు నేషనల్‌ పెన్షన్ స్కీమ్‌ (NPS) ఖాతా ఓపెన్‌ చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ వార్త మీకోసమే.

Update: 2022-05-02 08:30 GMT

ఇప్పుడు పోస్టాఫీసు నుంచి పెన్షన్ ఖాతా.. ఇంటి దగ్గరి నుంచే చెల్లింపులు..!

National Pension Scheme: మీరు నేషనల్‌ పెన్షన్ స్కీమ్‌ (NPS) ఖాతా ఓపెన్‌ చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ వార్త మీకోసమే. ఇప్పుడు మీరు పోస్టల్‌ శాఖ నుంచి ఆన్‌లైన్‌లో NPS సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. పోస్టాఫీసులో ఏప్రిల్ 26, 2022నుంచి ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా NPS సభ్యత్వం ప్రారంభించారు. 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు పోస్ట్‌ల శాఖ వెబ్‌సైట్‌లోని 'నేషనల్ పెన్షన్ సిస్టమ్-ఆన్‌లైన్ సర్వీసెస్' కేటగిరీకి వెళ్లి 'కొత్త రిజిస్ట్రేషన్, చెల్లింపులు, SIP వంటి సౌకర్యాలు పొందవచ్చు. ఈ సేవలన్నింటికి పోస్టాఫీసు చాలా తక్కువ రుసుము తీసుకుంటుంది.

నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇప్పుడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (DOP) ద్వారా అందుబాటులో ఉంటుంది. ఇది భారత ప్రభుత్వ స్వచ్ఛంద పెన్షన్ పథకం. దీనిని 2010 నుంచి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA)నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, సామాన్య పౌరులు ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. 18నుంచి 70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ఈ పథకం కింద పెట్టుబడి పెట్టవచ్చు. ప్రవాస భారతీయులు (NRI) కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. NRIలు చేసే విరాళాలు RBI,FEMA నియంత్రణలో ఉంటాయి.

ఎవరు పెట్టుబడి పెట్టగలరు

కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, సామాన్య పౌరులు ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. 18-70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ఈ పథకం కింద పెట్టుబడి పెట్టవచ్చు. ప్రవాస భారతీయులు (NRI) కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. NRIలు చేసే విరాళాలు RBI మరియు FEMAచే నియంత్రించబడతాయి. ఏదైనా NPSసబ్‌స్క్రైబర్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCD(1) ప్రకారం స్థూల ఆదాయంలో 10%వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చు. ఇది మొత్తం రూ.సెక్షన్ 80CCE కింద 1.5 లక్షల వరకు పరిమితి ఉంటుంది.

Tags:    

Similar News