Multibagger Stocks: రూ. 1 లక్ష పెట్టుబడి రూ. 25 లక్షలుగా మారింది.. ఏడాదిలో హై రిటర్స్ అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఏదంటే?
ఈ కంపెనీ షేరు జనవరి 4, 2021న రూ. 36.20 నుంచి రూ. 940కి పెరిగింది. ఇది గత 12 నెలల్లో 2,469 శాతం రాబడిని అందించింది.
Multibagger stocks: Xpro ఇండియా స్టాక్ ఒక సంవత్సరంలో దాదాపు 2,500 శాతం రాబడిని అందించింది. ఈ స్టాక్ జనవరి 4, 2021న రూ. 36.20 నుంచి రూ. 940కి పెరిగింది. గత 12 నెలల్లో 2,469 శాతం రాబడిని అందించింది. ఈ కాలంలో సెన్సెక్స్ 23.61 శాతం లాభపడింది.
గతేడాది జనవరి 4న ఎక్స్‌ప్రో ఇండియా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన రూ.1 లక్ష రూపాయాలు.. నేడు రూ.25.96 లక్షలుగా ఉండేవి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో స్మాల్ క్యాప్ స్టాక్ 4.94 శాతం పడిపోయి, క్రితం ముగింపు రూ.937.35తో పోలిస్తే రూ.891 కనిష్ట స్థాయికి చేరుకుంది. Xpro ఇండియా స్టాక్ 50 రోజులు, 100 రోజులు, 200 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే ఎక్కువగా ట్రేడవుతోంది. కానీ 5 రోజులు, 20 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే తక్కువగా ఉంది. ఈ స్టాక్ డిసెంబర్ 8, 2021న 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,015ను తాకింది. జనవరి 1, 2021న రూ.34.50 వద్ద 52 వారాల కనిష్టానికి చేరుకుంది.
సంస్థ ఆర్థిక పనితీరుతో ఈ స్టాక్‌లో అధిక వృద్ధి సాధ్యమైంది. అయితే, BSE ఈ స్టాక్‌ను ASM LT స్టేజ్ IV కేటగిరీ కింద ఉంచింది. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర లాభంలో 1,987 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్చి 2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 0.40 కోట్ల లాభంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ. 8.35 కోట్లకు పెరిగింది.
మార్చి 2020 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు రూ. 354.84 కోట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 5.22 శాతం పెరిగి రూ. 373.35 కోట్లకు పెరిగాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 105.69 శాతం పెరిగి రూ.10.84 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 5.27 కోట్లుగా ఉంది.
సెప్టెంబరు 2021తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ విక్రయాలు 29.58 శాతం వృద్ధి చెంది రూ.126.55 కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.97.66 కోట్లుగా ఉన్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన, జూన్ త్రైమాసికంలో నికర లాభం రూ.5.02 కోట్ల నుంచి 115.94% పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అమ్మకాలు రూ.91.12 కోట్ల నుంచి 38.88 శాతం పెరిగాయి.
ఎక్స్‌ప్రో ఇండియా అనేది బిర్లా గ్రూప్‌నకు చెందిన సంస్థ. కెపాసిటర్లు, రిఫ్రిజిరేటర్‌ల కోసం లైనర్‌లతోపాటు ప్యాకేజింగ్ మెటీరియల్‌ల తయారీలో నిమగ్నమై ఉంది. ప్రస్తుతం, కెపాసిటర్ల కోసం ప్యాకేజింగ్ మెటీరియల్‌ని తయారు చేస్తున్న భారతదేశంలోని ఏకైక సంస్థగా నిలిచింది.